Home » Raptadu
జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలవు తున్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆస్పత్రి యాజమాన్యం బాధితులను డిమాండ్ చేస్తోందిని ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఫిర్యాదులు వచ్చాయి. మండలంలోని గంగంపల్లికి ఎమ్మెల్యే శనివారం వెళ్లినప్పుడు... ఆ గ్రామానికి చెందిన బాధితుడు శ్రీకాంత తల్లి గోవిందమ్మ అనే మహిళ తన గోడు వెళ్లబోసుకున్నారు.
గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్ణయించాల్సింది ఆ గ్రామస్థులే అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని గంగంపల్లి తండాలో శనివారం పల్లెపండుగ కార్యక్ర మంలో ఆమె పాల్గొని సీసీరోడ్లకు భూమిపూజచేశారు. నసనకోట పంచా యతీ గంగంపల్లి ఎీస్సీకాలనీలో ఎనఆర్‌జీఎస్ నిధులు రూ.20లక్షలు, జడ్పీ నిధులు రూ.48లక్షలతో సీసీరోడ్లకు భూమిపూజ చేశారు.
మండలంలోని ఒంటికొండ గ్రామంలో ప్రధాన రహదారపైపై వర్షపు నీరు నిలిచి మడుగును తలపిస్తోంది. వర్షం కురిసినప్పుడల్లా నీరు నిలుస్తుం డటంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రధాన రోడ్డుపై పెద్దఎత్తున నీరు నిలిచింది.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపా రు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా గురువారం మండలంలో ని గొం దిరెడ్డిపల్లి, పుల్లలరేవు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. గొందిరెడ్డిపల్లిలో రూ. 14.50 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రూ. లక్ష సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.
కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి జాడ మొదలైందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నా రు. మండలంలోని మేడాపురం గ్రామంలో బుధవారం పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.60లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. జడి వాన కురుస్తున్న స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రతి రైతు ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. మండలంలోని తలుపూరు, వడ్డుపల్లి గ్రామాల్లో బుధవారం ఈ పంట నమోదును జిల్లా వ్యవసాయ అధికారులతో కలసి కలెక్టర్ సూపర్ చెక్ చేశారు.
మండలకేంద్రంలో బుధవారం రాత్రి ఈ దురు గాలి, వడగండ్లవాన బీభత్సం సృష్టించాయి. వాటి ధాటికి పలు పంట లు దెబ్బతినడంతో రైతులకు తీవ్రంగా నష్టం కలిగింది. రేకుల దుకా ణాలు, షెడ్లు, విద్యుతస్తంభాలు పలు చెట్లు నేలకొరిగాయి. సీకేపల్లి జాతీయ రహ దారి పక్కన గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాధాక్రిష్ణ ఏర్పాటు చేసు కున్న రేకుల దుకాణాలు తీవ్రమైన గాలుల ధాటికి రహదారి అవతల ఉన్న లేఔట్లలోకి ఎగిసిపడ్డాయి.
మండల కేంద్రంలోని ఆటోనగర్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. తరచూ రాత్రిళ్లు అక్కడి మెకానిక్ షాపుల్లోకి చొరబడి వాహనాల సామగ్రి ఎత్తుకెళ్లి, అమ్ముకుంటున్నారు. రిపేరీ కోసం వచ్చిన వాహనాల విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్తుండటంతో మెకానిక్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారి పక్కన 554-2 సర్వే నెంబర్‌లో 33 ఎకరాల్లో ఆటో నగర్ ఉంది. ద్విచక్రవాహనం మినహా మిగతా అన్ని వాహ నాల రిపేరీకి మెకానిక్ షాపులు ఉన్నాయి.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వెనుకబడిన ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని జనచైతన్యకాలనీలో గురువారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తొలుత జనచైతన్య కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.