• Home » Raptadu

Raptadu

MLA : బాధ్యత మరచిపోకండి

MLA : బాధ్యత మరచిపోకండి

ఇవి పదవులు కాదు.. బాధ్యతలన్నది మరచిపోవద్దని ఎమ్మెల్యే పరిటాల సునీత సూ చించారు. నియోజకవర్గంలో శనివారం ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాఽధ్యక్షులు, టీసీ మెంబ ర్లు నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. పుష్పగుచ్ధాలు అందజేశారు.

ANGANWADI : అర్ధంతరంగా అంగనవాడీ భవనాలు

ANGANWADI : అర్ధంతరంగా అంగనవాడీ భవనాలు

గర్భిణులు, చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ... చిన్నారులకు ప్రాథమిక విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన వాడీ కేంద్రాల భవనాల నిర్మాణాలు అర్థంతరంగానే నిలిచిపోయాయి. సకాలంలో బిల్లులు కాలేదని కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపి వేశా రు.

MLA : రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి

MLA : రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలి

రాప్తాడు నియోజకవర్గంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరిగే సాగునీటి సంఘాల ఎన్నికలు రాజకీయాలకు అ తీతంగా జరగాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. ఆమె గురువారం అనంతపురం లోని తన క్యాంప్‌ కార్యాలయంలో టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. రాప్తాడు నియోజకవర్గంలోని 32 చెరువుల పరిధిలో సాగు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

MLA : శ్మశానానికి వేరే స్థలం కేటాయించండి

MLA : శ్మశానానికి వేరే స్థలం కేటాయించండి

ఊరికి అగ్నిమూలన శ్మశానం ఉందని, మరోచోట స్థలం కేటాయించాలని కామారుపల్లి గ్రామస్థులు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విజ్ఞప్తి చేశారు. మండలపరిధిలోని కామరుపల్లిలో తహసీల్దార్‌ మోహనకుమార్‌ అధ్యక్షతన మంగళవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆర్డీఓ కేశవనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు గ్రామంలోని పలు సమస్యల ను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

DEVOLOPEMENT : గ్రామాల్లో అభివృద్ధి పరుగులు

DEVOLOPEMENT : గ్రామాల్లో అభివృద్ధి పరుగులు

గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల అభి వృద్ధి కుంటుపడింది. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో వీదిలైట్లు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి కనీస వ సతులను కల్పించలేదు. దీంతో గ్రామ వీధులు మురు గునీరు, వర్షపు నీరు నిలిచి అధ్వానంగా మారా యి. వాటిపై సంచారానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడా రు. అయితే కూట మి ప్రభుత్వం అదికారంలోకి వచ్చి న ఆరు నెలల్లోనే వివిధ రకాల అభివృద్ధి పనులు జరు గుతున్నాయి.

MLA : గ్రామాల్లో అభివృద్ధిపై ప్రజల్లో హర్షం

MLA : గ్రామాల్లో అభివృద్ధిపై ప్రజల్లో హర్షం

గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోం దని, ఆర్నెల్లలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్క్‌ కనిపిస్తోందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొ న్నారు. ఆమె సోమవారం మండలపరిధిలోని కుంటిమద్ది గ్రామంలో రూ. 36.50 లక్షల వ్యయంతో ఎనఆర్‌జీఎస్‌ నిధులతో నిర్మించిన సీసీరోడ్లను స్థానిక టీడీపీ నాయకు లు, అధికారులతో కలిసి పరిశీలించారు.

AUTO NAGAR : గుంతల రోడ్లు - వెలగని వీధి లైట్లు

AUTO NAGAR : గుంతల రోడ్లు - వెలగని వీధి లైట్లు

మండల కేంద్రం సమీపంలో ఉన్న ఆటో నగర్‌లో సమస్యలు తిష్ట వేశాయి. ప్రధాన రోడ్లు, లింక్‌ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. భారీ గుంతలు ఏర్పడటంతో వర్షపు నీరు ఎక్కువగా నిలిచి బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనాలతో పాటూ ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటో నగర్‌లో చాలా వరకు వీధిలైట్లు కూడా లేకపోవడంతో చీకటి మయం గా ఉంది.

MLA : పనిచేయాలంటే ఉండండి... లేదంటే వెళ్లిపోండి

MLA : పనిచేయాలంటే ఉండండి... లేదంటే వెళ్లిపోండి

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే పరిటాల సునీత తీ వ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ గు రువారం అనంతపురం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మీడియాతో మా ట్లాడారు. గతంలో చెన్నేకొత్తపల్లి, రామ గిరి, రాప్తాడు మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయన్నారు.

PUBLIC  FORM : ప్రజావేదిక అవినీతి గోరంతేనా..?

PUBLIC FORM : ప్రజావేదిక అవినీతి గోరంతేనా..?

మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో రూ 2,07,159 అవినీతి జరిగిందని సామాజిక తనిఖీబృందం సభ్యులు తేల్చారు. స్థానిక ఎంపీడీ ఓ కార్యాలయం ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. డ్వామాపీడీ విజ యేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీల వారీగా తనిఖీల వివరాలను వెల్లడించారు.

MLA : పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీబిజీ

MLA : పలు కార్యక్రమాలతో ఎమ్మెల్యే బిజీబిజీ

ప్రజాసమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల తో ఎమ్మెల్యే పరిటాలసునీత సోమవా రం బిజీబిజీగా గడిపారు. భక్త కనకదాస జయంతి వేడుకలను వెంకటాపురం గ్రామంలో కరుబలు నిర్వహించగా, ఆమె జ్యోతుల ఊరేగింపులో పాల్గొన్నారు. కనకదాస చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి