Home » Ranji Trophy
బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై కరుణ్ నాయర్ (74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (56 బ్యాటింగ్) అర్ధ శతకాలు నమోదు చేయడంతో.. ముంబైతో రంజీ ఫైనల్లో విదర్భ పోరాడుతోంది. 538 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన విదర్భ ఆట ముగిసేసరికి 5 వికెట్లకు 248 పరుగులు చేసింది.
ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందగా.. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఏకంగా సచిన్ టెండూలర్క్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై 136 పరుగుల చేసిన ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయస్కుడిగా అవతరించాడు.