Home » Ramoji Film City
రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రను ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి రామోజీ గ్రూపు సంస్థల కార్యాలయాల మీదుగా స్మారక కట్టడం వరకు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించింది. తెలంగాణ పోలీసులు గౌరవవందనం చేశారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు పాల్గొన్నారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని.
రామోజీరావు గారి మరణం దిగ్ర్భాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది.
చాలా బాధాకరం. యుగపురుషుడు... ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రామోజీరావు చివరి శ్వాస వరకూ సమాజహితం కోసం పని చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేశారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు.
రామోజీ మరణంతో మీడియా, వినోద రంగం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. రామోజీరావు ఎంతో మందికి మార్గదర్శకునిగానిలిచారు. ఆయన ఎందరికో ఆదర్శమైన వ్యాపారవేత్త.
రామోజీరావు మరణంతో ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, శక్తిమంతమైన వ్యవస్ధ అని తెలిపారు. ఆయన చేతలు, రాతలు, ఆయన చేపట్టిన కార్యక్రమాలు భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) ఇవాళ తెల్లవారుజామున ఆరోగ్య సమస్యలతో మృతిచెందారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ నానక్‌రామ్ గూడలోని స్టార్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గుండెకు స్టెంట్ వేసి, ఐసీయూలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతిపట్ల తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), ఆయన సతీమణి భువనేశ్వరి కూడా సంతాపం ప్రకటించారు.
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు...