Home » Rammohannaidu Kinjarapu
దేశంలో సీ ప్లేన్ మార్గదర్శకాలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విడుదల చేశారు. దేశంలో సీ ప్లేన్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడుతాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులను త్వరలో నిర్మిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. వీటితో పాటు తెలంగాణలో కూడా కొత్త ఎయిర్ పోర్టులను నిర్మిస్తామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా చాలా ఎయిర్ పోర్టులను త్వరలో పూర్తి చేయనున్నామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 11 వరకు ఏవియేషన్ కల్చర్ వీక్ నిర్వహణలో భాగంగా శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో 10కే రన్‌ను ఆయన ప్రారంభించారు.
Andhrapradesh: కింజరాపు రామ్మోహన్ నాయుడు. తండ్రి ఎర్రన్నాయుడు మరణానంతరం 26 సంవత్సరాలకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రామ్మోహన్ టీడీపీలో అంచలంచెలుగా ఎదిగారు. మూడు సార్లు వరుసగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఉంటూ ఏపీలో అనేక సమస్యలపై పార్లమెంటులో గళమెత్తారు. ఇప్పుడు కేంద్రమంత్రిగా తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో నిర్మిస్తున్న నూతన ఇంటగ్రల్ టెర్మినల్ వచ్చే ఏడాది జూన్ నాటికి సిద్ధమవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు తెలిపారు. 2020 జూన్‌లో 611.80 కోట్ల అంచనా వ్యయంతో దీని
న్యూఢిల్లీ: విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులపై పార్లమెంట్‌లో మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలసౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం ఇచ్చారు... విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2020 జూన్‌లో ప్రారంభమయ్యాయని, మొత్తం రూ. 611 కోట్ల అంచనాలతో పనులు మొదలు పెట్టారన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు దృష్టి సారించారు. అందులోభాగంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పర్యవేక్షించారు. ఆ క్రమంలో ఎయిర్‌పోర్ట్ టెర్మినల్, రన్ వే తదితర నిర్మాణాలను ఆయన పరిశీలించారు.
కేంద్ర క్యాబినెట్ కమిటీల(Central Cabinet committees) సభ్యులుగా తెలుగు కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu), కిషన్ రెడ్డి(Kishan Reddy)కి అవకాశం దక్కింది. పార్లమెంటరీ, రాజకీయ వ్యవహారాల కమిటీల్లో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకం అయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది.
భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టెర్మినల్ వన్ విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో వెల్లడించారు.