Home » Ramgopal Varma
సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సి ఉంది.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
పోలీసులు తనకిచ్చిన నోటీసులపై డైరక్టర్ రాంగోపాల్ వర్మ స్పందించారు. ప్రస్తుతం తాను షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, విచారణకు సహకరిస్తానని, వారం రోజుల గడువు కావాలని కోరుతూ మద్దిపాడు పోలీసులకు ఆయన వాట్సాప్ మెసేజ్ పెట్టారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పినా వినడం లేదు.