• Home » Rajya Sabha

Rajya Sabha

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యాచార ఘటనతోపాటు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి.

AP : ఇద్దరు వైసీపీ ఎంపీలు అవుట్‌!

AP : ఇద్దరు వైసీపీ ఎంపీలు అవుట్‌!

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ పదవులకు రాజీనామా చేశారు.

Mopidevi Venkataramana: రాజీనామాకు ముందు మోపిదేవి సంచలన వ్యాఖ్యలు..

Mopidevi Venkataramana: రాజీనామాకు ముందు మోపిదేవి సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ ఆవిర్భావం నుంచి అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కుడి భుజంగా ఉన్న మోపిదేవి వెంకటరమణ.. ఆ పార్టీకి రాజీనామా చేసేస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీలో విసిగివేసారిపోయిన ఆయన గుడ్ బై చెప్పేశారు.. ఈ సందర్భంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడిన మోపిదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్, వైఎస్ జగన్ పేర్లు ప్రస్తావించి మరీ.. ఇద్దరి మధ్య ఉన్న తేడాలను కూడా చెప్పుకొచ్చారు..

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను

AP Politics: మోపిదేవి బాటలో మరో ఎంపీ..ఎవరతను

లోక్‌సభ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

Raja Sabha by-polls: రాజ్యసభకు కేంద్ర మంత్రులు బిట్టు, కురియన్ ఏకగ్రీవ ఎన్నిక

రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్‌ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

NDA: ఎగువ సభలో తొలిసారి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న ఎన్‌డీఏ

NDA: ఎగువ సభలో తొలిసారి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న ఎన్‌డీఏ

తొమ్మిది రాష్ట్రాల్లోని 12 స్థానాలకు జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికల్లో(Rajya Sabha by elections) అభ్యర్థులందరూ దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. నామినేషన్ల చివరి రోజైన బుధవారం ఏ రాష్ట్రంలోనూ అదనంగా అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

Rajya Sabha: సింఘ్వీ నామినేషన్‌

Rajya Sabha: సింఘ్వీ నామినేషన్‌

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి ఉపేందర్‌రెడ్డికి నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

CM Revanth Reddy: ‘విభజన’లో చిక్కులు..

CM Revanth Reddy: ‘విభజన’లో చిక్కులు..

రాష్ట్ర పునర్విభజన చట్టం అమల్లో రాజ్యాంగపరంగా, న్యాయపరంగా అనేక చిక్కులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని కేంద్రం పదేళ్లుగా అమలు చేయడం లేదన్నారు.

BRS: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు:బీఆర్‌ఎస్‌

BRS: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు:బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అస్తిత్వానికి భంగం కలుగుతోందని, స్వార్థ రాజకీయం కోసం రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ నేతలు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ఆరోపించారు.

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

TG News: తెలంగాణేతరులకు రాజ్యసభ సీటు కేటాయించడంపై బీఆర్ఎస్ ఫైర్..

మాజీ బీఆర్ఎస్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కె.కేశవరావు(కేకే) రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వి పేరు ప్రకటించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణేతర వ్యక్తికి ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరుగుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి