Home » Rajya Sabha
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా, నిరసనలు, గందరగోళం కారణంగా సభలు సజావుగా కొనసాగడం లేదు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రతిపక్షాల వైఖరి సభా కార్యకలాపాలను దెబ్బతీస్తోందని బీజేపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేశారు. వీరిలో ముంబైపై ఉగ్రవాద దాడి 26/11 కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్..
రాజ్యసభలో ఏకంగా 72 స్థానాలకు 2026 ఏప్రిల్, జూన్, నవంబరుల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ తనతో మాట్లాడారని ఉజ్వల్ నికం చెప్పారు.
నామినేటెడ్ సభ్యులతో కూడిన జాబితాను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(ఎ)లోని క్లాజ్ (3) కింద రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది.
నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగగా, వీటిలో రెండు స్థానాలను ఆప్ గెలుచుకుంది. గుజరాత్‌లో ఒక అసెంబ్లీ స్థానాన్ని, పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది.
డీఎంకే ఒక రాజ్యసభ సీటును ఎంఎన్ఎన్‌కు కేటాయిస్తూ కమల్‌హాసన్ పేరును ఇటీవల ప్రకటించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 మంది సభ్యులుండగా, రాజ్యసభ అభ్యర్థుల గెలుపునకు ఒక్కొక్కరికి 34 ఓట్లు అవసరమవుతాయి.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.
రాజ్యసభ సభ్యుడిగా పాకా వెంకట సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక. ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం, ఈ ఎన్నికకు ఒకే నామినేషన్ మాత్రమే చెల్లుబాటయ్యింది.
బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి వనితారాణి సమక్షంలో పత్రాలు అందజేశారు.