Home » Rajnath Singh
జమ్మూ-కాశ్మీర్‌లోని దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత ఆర్మీ సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
వెన్నునొప్పి కారణంగా ఎయిమ్స్ లో చేరిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆయన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగంలో చేరారు.
దేశ రక్షణ రంగ ఉత్పత్తుల్లో కేంద్రం మరో మైలురాయిని చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2023-24లో 16.7 శాతం వృద్ధి రేటు సాధించింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో రూ.1,26,887 కోట్లకు చేరినట్టు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారంనాడు తెలిపారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నివీర్ అజయ్ కుమార్ కుటుంబానికి పారితోషికం గురించి భారత సైన్యం(Indian Army) బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అజయ్ వీర మరణాంతరం వారి కుటుంబానికి పరిహారం చెల్లించలేదనే ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.
రెండు రోజుల విరామం తర్వాత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈనెల 24వ తేదీన లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగా.. మొదటి రెండు రోజులు ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మూడో రోజు స్పీకర్ ఎన్నిక జరిగింది.
హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌తోపాటు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో రహదారుల విస్తరణ, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకుగాను రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నేతలు మంగళవారం సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం జరుపనున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది.
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్‌లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ రాత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7:15 గంటలకు మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా.. ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.