Home » Rajendranagar
నార్సింగి(Narsingi) పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు రాజేంద్రనగర్(Rajendranagar) డీసీపీ శ్రీనివాస్(DCP Srinivas) వెల్లడించారు. ఈనెల 9న బాధితుడు కుటుంబంతో సహా వ్యక్తిగత పని నిమిత్తం విజయవాడకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి ఇంట్లో సుమారు కోటి రూపాయల విలువైన సొత్తు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు 24గంటల్లోనే కేసు ఛేదించి సొత్తును బాధితులకు అప్పగించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
హరి తహారం కార్యక్రమంలో బండ్లగూడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ (కాంగ్రెస్), మాజీ మేయర్ (బీఆర్‌ఎస్) వర్గీయులు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ సమక్షంలోనే గొడవపడి కొట్టుకు న్నారు.
వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా సాటి మనిషికి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌కు సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
మానవ మనుగడకు వ్యవసాయమే ఆధారమని గవర్నర్ రాధాకృష్ణన్ అన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విత్తనం కీలకమని, జయశంకర్ వర్సిటీ నాణ్యమైన, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తుండటం హర్షణీయమని అభినందించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగీ, సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా నైజీరియన్స్ నివశించే ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్‌ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హరిని అనే బాలిక ఇంటర్ మొదటి సంవత్సరంలో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్థాపం చెంది గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. క్షణికావేశంలో విద్యార్థిని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Telangana: బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్ర నగర్‌లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ సందర్భంగా బద్వేల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..
Telangana: రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్‌లో చేరతారంటూ గత కొద్దిరోజులుగా వినిపించిన వార్తలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్‌గౌడ్ వ్యతిరేక వర్గం మాత్రతం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మూడు రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే కలిశారు.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ శివరాంపల్లిలో నడుస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఇన్నోవా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు ముందు భాగం నుంచి మంటలను గమనించిన డ్రైవర్ కిందకు దిగి ప్రాణాలు దక్కించుకున్నాడు.