Home » Raja Singh
Telangana: గణేష్ నిమిజ్జనంపై పోలీస్ కమిషనర్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. గత నిమజ్జన సమయంలో చాలామంది మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించారని గుర్తుచేశారు. సోషల్ మీడియాలో ఆ వీడియోస్ వైరల్ కూడా అయ్యాయని తెలిపారు. గణేష్ నిమజ్జనం సమయంలో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు.
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవటం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు.
Telangana: ఏపీలో పురాతన దేవాలయాలను, ఎండోమెంట్ భూములను కాపాడాలని ఈనెల 6న సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. లేఖపై ఏపీ సీఎంవో కార్యాలయం నుంచి తనకు ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదన్నారు. చంద్రబాబు నాయుడు తనకు రాజకీయ గురువన్నారు.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కిషన్‌రెడ్డి(Kishan Reddy)ని కేంద్రమంత్రివర్గంలో తీసుకోవడంతో తెలంగాణకు కొత్త అధ్యక్షుడిని నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇటీవల ఆ పార్టీ నుంచి గెలిచిన 8మంది ఎంపీల్లో ఇద్దరిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు.
బక్రీద్ గోరక్షాలకు బ్లాక్ డే లాంటిది అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంభం అనిల్, ఉత్తమ్ పద్మావతి ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పిన విధానాన్ని తప్పు పట్టారు.
మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో పోలీసులు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన మెదక్ వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గాయపడిన అరుణ్ రాజును గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరుణ్‌ను రాజాసింగ్ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజాసింగ్.. మెదక్ ఘటనలో పోలీసులు సరైన సమాయానికి స్పందించి ఉంటే..
MLA Rajasingh Arrest: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌లో అల్లర్లు జరిగిన నేపథ్యంలో.. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వైద్యపరీక్ష నిమిత్తం మియాపూర్‌లో ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇదిలాఉంటే.. మెదక్‌లో ఘర్షణల నేపథ్యంలో..
రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి కేసీఆర్ మతి స్థిమితం కోల్పోయారని, సీఎం రేవంత్‌రెడ్డికి భయపడే ఆయన అసెంబ్లీకి రావడం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్‌ఎ్‌సఎల్పీ బాద్యతలను కేటీఆర్‌కు అప్పగిస్తే గనక కొత్త దుకాణం పెట్టాలనే ఆలోచనతో హరీశ్‌రావు ఉన్నారని, జూన్ 5 తర్వాత బీఆర్‌ఎస్ భూస్థాపితం అవుతుందని పేర్కొన్నారు.
Telangana:జిల్లాలో బీజేపీ భారీ ర్యాలీ చేపట్టింది. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా భారీ ఎత్తున యువత తలివచ్చారు. అలాగే ర్యాలీకి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.