Home » Rain Alert
కోస్తా తీరంలో 975 కిలోమీటర్లపాటు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రకృతి విపత్తులు, సునామీ, తుఫానుల నుంచి భూమిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మొక్కల పెంపకంతో సముద్ర తీరంలో పర్యావరణ సమతుల్యత సాధించడానికి ప్రణాళికలు రూపొందించారు.
వాతావరణ మార్పులకు అనుగుణంగా శరీరం సంరక్షణ అవసరం. పండ్లు, కూరగాయలు, మంచినీరు, వ్యాయామం, నిద్ర వంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తగ్గిస్తాయి.
Heavy Rains: వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల్లో తీరం దాటింది. ఇది క్రమంగా బలహీనపడింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుపడే అవకాశం ఉంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటి రాసుకున్నది. రాష్ట్రంలో కోస్తా, రాయలసీమలో వర్షాలు, పిడుగులు కురిసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో బుధ, గురువారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం లేకపోయినా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి.
Rain Forecast: ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడన ప్రభావం పడనుంది. మే 26, 27, 28, 29 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావారణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రవేశించే అవకాశం ఉంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు ఆదివారం మహారాష్ట్రలోనికి ప్రవేశించాయి. అరేబియా సముద్రంలో అనేక ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, వీటికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ట్రలో కొంత భాగం, బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మణిపూర్, నాగాలాండ్‌లో పలు ప్రాంతాల వరకు రుతుపవనాలు విస్తరించాయి.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణానికి ఎనిమిది రోజులు ముందుగానే కేరళను తాకాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి వాతావరణం అనుకూలంగా ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.