Home » Raghurama krishnam raju
రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో శుక్రవారం విచారణకు రాలేనని కొంత సమయం కావాలని 7, 8 తేదీల్లో విచారణకు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు పోలీస్ అధికారులను కోరారు. ఈ మేరకు ఒంగోలు ఎస్పీకి లేఖ రాశారు.
కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తనకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్‌కు ఆయన లేఖ రాశారు.
రంగంపేట, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎడ్ల పందేలు, కోడి పందేలు మన సంప్రదాయాల్లో, గ్రామీణ సంస్కృతిలో భాగమని, ఇవి లేకపోతే నాణ్యమైన పశుపక్ష్యాదుల సంపద అంతరించిపోతుందని, చట్టాన్ని అతిక్రమించకుండా ఇలాంటి పందేలను ఆదరించి పోషించుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మం డలం వడిశలేరు గ్రామం వద్ద గన్ని సత్యనారాయణమూర్తి స్మారక 6వ వార్షిక రాష్ట్రస్థా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన ఏపీలో ఆదరణ లేకపోవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మనది అని చెప్పుకొని సాంస్కృతిక, సాంప్రదాయ కళలు అంతరించిపోకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్‌ను మరి కాసేపట్లో ఒంగోలు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తరువాత ఆయనను గుంటూరుకు తరలించనున్నారు.
ప్రకాశం జిల్లా: ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సీఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. 2021 మే 14న రఘురామకృష్ణం రాజు పుట్టన రోజునే ఆయనను హైదరాబాద్‌లో అక్రమంగా అరెస్టు చేశారు. అక్కడి నుంచి గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురిచేశారు.
తన కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్ పాల్ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రఘురామ కృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. తనను దారుణంగా చిత్రవధ చేశారని.. చంపాలని చూసారని అన్నారు. అందుకు సాక్ష్యంగా మిలటరీ ఆసుపత్రి నివేదికలున్నాయన్నారు. న్యాయం గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు(RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును విజయ్‌పాల్ ఆశ్రయించారు.
రఘురామ ఏదైనా ఫ్రాంక్‌గా మాట్లాడతారని.. ఆయనకు కల్మషం ఉండదు ముందు, వెనుక చూడకుండా మాట్లాడుతారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్లుగా రఘురామ చెబుతారని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చిందని రఘురామ గురించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్‌కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.