Home » Raghunandan Rao
బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు మావోయిస్టుల పేరిట బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. సోమవారం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ పాఠశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి..
బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావుని చంపేస్తామని పీపుల్స్ వార్ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసి బెదిరించారు. సోమవారం సాయంత్రంలోగా చంపుతామంటూ ఎంపీని హెచ్చరించారు. తాను మధ్యప్రదేశ్‌కి చెందిన మావోయిస్టునని బెదిరింపులకు పాల్పడ్డాడు.
కేసీఆర్, కేటీఆర్, కవితలది ఇంటి సమస్య, పైసల పంచాయితీ, రాజకీయ వారసత్వ పంచాయితీ అని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. కవిత ఏం మాట్లాడుతుందో ఆమెకే తెల్వదని ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.
ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్‌కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని.. సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
MP Raghunandan Rao: తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడా లేదని, బీఆర్ఎస్ చెల్లని రూపాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్‌లపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపించారని ఆయన అన్నారు.
కవిత షర్మిలలా పాదయాత్ర చేసి జూన్ 2న కొత్త పార్టీ స్థాపించవచ్చని రఘునందన్‌రావు చెప్పారు. ఆయన ఈ ప్రక్రియపై ప్రశ్నలు వేసి, బీసీల అవమానం, సామాజిక సమస్యలపై ఆమె మాటలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
MP Raghunandan Rao: రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశద్రోహులను వెంటనే దేశం నుంచి పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చిన ఇప్పటికి అధికార యంత్రాంగం ఎందుకు స్పందించడం లేదని ఎంపీ రఘునందన్ రావు నిలదీశారు.