Home » Raghunandan Rao
మెదక్ పట్టణంలో జరిగిన ఘర్షణలో గో సంరక్షకుడు అరుణ్ రాజు గాయపడ్డాడు. ఆయన మియాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కత్తి పోట్లకు గురై చికిత్స పొందుతున్న అరుణ్ రాజును నేడు(ఆదివారం) మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) పరామర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి (Sarpanch Konyala BalReddy) అన్నారు. ములుగు మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు.
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు.
ఇవాళ హస్తినకు తెలంగాణ బీజేపీ నేతలు వెళుతున్నారు. ఎంపీలుగా విజయం సాధించిన బండి సంజయ్, డీకే అరుణ, రఘనందనరావు తదితరులు ఢిల్లీకి వెళుతున్న వారిలో ఉన్నారు. రేపు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగనుంది. బీజేపీ ఎంపీలు సమావేశానికి హాజరుకానుంది. ఇప్పటికే ఢిల్లీలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
సొంత జిల్లాలో, తాను ఇన్‌చార్జిగా ఉన్న చేవెళ్ల, తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో గెలిపించుకోని చేతకాని వ్యక్తి ఉద్దెర మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజీపీ కార్యకర్తల భేటీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని తప్పనిసరిగా గెలిపించాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రె్‌సను గెలిపిస్తే.. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించే ప్రమాదం ఉందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్‌ను బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) శుక్రవారం కలిశారు. లోక్‌సభ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని డిస్‌క్వాలిఫై చేయాలని సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్కో ఓటర్‌కు ఆయన రూ. 500లు పంపిణీ చేశారని ఆరోపించారు.
మెదక్ పార్లమెంటు నియోజకవర్గం సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రామారెడ్డి బరిలోకి దిగారు.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.