• Home » Ragging

Ragging

Tirupati News: ఎస్పీ హెచ్చరిక.. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే..

Tirupati News: ఎస్పీ హెచ్చరిక.. ర్యాగింగ్‌కు పాల్పడితే జైలుకే..

ర్యాగింగ్‌ అనేది సరదా కాదనీ, అదొక అమానుషమైన విషయమని ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఎవరైనా ఎక్కడైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్టు తమ దృష్టికి వస్తే జైలుకు పంపి కఠిన శిక్ష అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎస్వీయూనివర్సిటీ శ్రీనివాసా ఆడిటోరియంలో మంగళవారం స్టూడెంట్‌ వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌ విభాగం ర్యాగింగ్‌ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించింది.

Ragging: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో  ర్యాగింగ్ కలకలం

Ragging: నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో ఫస్టియర్ ఇయర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతనిపై వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీనిపై బాధిత విద్యార్థి కాలేజీ ప్రిన్స్‌పాల్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Ragging: వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ సీరియస్‌

Ragging: వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌పై ఎన్‌ఎంసీ సీరియస్‌

వైద్య విద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ రోగం వికృతరూపం దాల్చుతోంది. తెలంగాణలోనూ ఇటీవల నాలుగైదు కాలేజీల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పింది. దేశవ్యాప్తంగా పలు కాలేజీల్లో దీనిపై పెద్దఎత్తున ఫిర్యాదులందినట్టు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేర్కొంది.

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..

ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Medical College: నల్లగొండ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ ?

Medical College: నల్లగొండ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ ?

నల్లగొండలో వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ భూతం కలకలం రేపింది. జూనియర్‌ వైద్య విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినందుకు కళాశాలకు చెందిన ఓ జూనియర్‌ డాక్టర్‌ సహా ముగ్గురు వైద్య విద్యార్థులను సస్పెండ్‌ చేసినట్టు తెలిసింది.

Kakinada: ఆర్ఎమ్‌సీ వైద్య కళాశాలలో అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం..

Kakinada: ఆర్ఎమ్‌సీ వైద్య కళాశాలలో అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం..

శ్రీకాకుళం జిల్లాకు చెందిన జగదీశ్‌ అనే వ్యక్తి రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి ఇంటర్న్‌ చేస్తున్నాడు. అక్కడే పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. అయితే శనివారం అర్ధరాత్రి తప్పతాగిన హౌస్ సర్జన్ జగదీశ్.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల హాస్టల్ గదుల్లోకి అక్రమంగా ప్రవేశించాడు.

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

Raging: కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం..

మీసాలు గడ్డాలు ఉండొద్దని.. తాము చెప్పిన కళ్ళజోడే వాడాలంటూ సీనియర్ వైద్య విద్యార్థులు జూనియర్లను వేధిస్తున్నారు. మీసాలు, గడ్డాలు తీసేయాలని, మేం చెప్పిన యాప్‌లనే స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్ల జూనియర్ వైద్య విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.

Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్

Himachal Pradesh: జూనియర్‌ని ర్యాగింగ్ చేసిన సీనియర్లు అరెస్ట్

హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్దులను అరెస్ట్ చేసినట్లు మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఈ ముగ్గురు విద్యార్థులను యూనివర్సిటీ సైతం బహిష్కరించిందని వారు తెలిపారు.

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

Andhra Pradesh: వైసీపీ-టీడీపీ మధ్య ‘ర్యాగింగ్’పై వార్.. అసలు సంగతి ఇదీ..

ర్యాగింగ్‌ (Ragging) పేరిట జూనియర్లపై సీనియర్‌ విద్యార్థులు పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనమే అయ్యింది. హాస్టల్‌ గదుల్లో జూనియర్లను కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి