Home » Rachakonda Police
ఈ ఏడాది ఆగస్టు నెలాఖరు వరకూ ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 520 పోక్సో కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోక్సో కేసుల నిందితులను విచారించగా వారు ఎక్కువగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నట్లు వెల్లడైందని పోలీసులు చెప్తున్నారు.
రాచకొండ పోలీసు కమిషనరేట్(Rachakonda Police Commissionerate) పరిధిలో బుధవారం భారీగా బదిలీలు జరిగాయి. 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు(Police Commissioner Sudhir Babu) ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ నుంచి మహారాష్ట్ర(AP to Maharashtra)కు వయా హైదరాబాద్ మీదుగా గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గరు అంత్రరాష్ట్ర స్మగ్లర్స్‌ను రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు(Rachakonda SOT Police) పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కేజీల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.
రియాజ్ హత్య కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ప్రధాన నిందితుడు హమీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ రియాజ్ హత్య కోసం రూ.13 లక్షల సుపారీ తీసుకున్నట్లు నిందితులు తమ విచారణలో వెల్లడించారన్నారు.
ఏవోబీ (ఆంధ్రా ఒడిశా బోర్డర్) నుంచి బెంగళూరుకు హాష్ ఆయిల్(Hash oil) స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను రాచకొండ పోలీసులు(Rachakonda Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 13.5 కేజీల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ బహిరంగ మార్కెట్లో రూ.14కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.