Home » Punjab
పంజాబ్ రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. చల్లని వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఉదయం వేళలో పొగమంచు కమ్మేస్తోంది. దీంతో బయటికి అడుగుపెట్టాలంటేనే జనాలు వణికిపోతున్నారు.
శిరోమణి అకాలీదళ్ పై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్నఅకాలీదళ్.. కనికరం లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండి పడ్డారు.
కొత్త ఇళ్లు నిర్మించగానే ఎవరి దిష్టీ పడకుండా ముందు వైపు దిష్టిబొమ్మలు తగిలించడం సర్వసాధారణంగా అంతా చేసే పనే. ఇంకొందరు తమ ఇళ్ల పరిసరాలను ఎవరూ అపరిశుభ్రం చేయకుండా దేవుళ్ల ఫొటోలు తగిలించడం, పాత చెప్పులను వేలాడదీయడం చేస్తుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...
ఓ పోలీసు ఉన్నతాధికారి డీఎస్పీని కాల్చి చంపి కెనాల్ పక్కన పడేశారు. ఈ షాకింగ్ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ సత్వీందర్ సింగ్ అలియాస్ సతిందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పై కేంద్రం ఉక్కుపాదం మోపింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967 కింద గోల్డీ బ్రార్‌ను టెర్రరిస్టుగా ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలియజేసింది.
రిపబ్లిక్ డే పరేడ్-2024లో శకటాల ప్రదర్శనకు పంజాబ్ శకటానికి చోటు దక్కకపోవడంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ చర్య పంజాబ్ పట్ల కేంద్రానికి ఉన్న వివక్షను చాటుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేసిన వ్యాఖ్యాలను కేంద్ర రక్షణ శాఖ ఆదివారంనాడు తోసిపుచ్చింది. మాస్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తెలిపింది.
లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి సీట్ల పంపకాలపై చర్చలను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్ర శాఖల నేతలతో డిసెంబర్ 29న చర్చలు జరుపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ విపక్షంలో ఉంది.
పంజాబ్ మంత్రి అమన్ అరోరాకు సునామ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కుటుంబ వివాదాల కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది. అమన్ అరోరాతోసహా 9 మందికీ రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
గ్యాంగ్‌స్టర్లపై పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్ తరహాలో వరుస ఘటనల్లో గ్యాంగ్‌స్టర్లను అదుపులో తీసుకుంటున్నారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలో గ్యాంగ్‌స్టర్లపై విరుచుకుపడిన లక్కీ పటియల్ ముఠాకు చెందిన ముగ్గురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
గాంగ్‌స్టర్లపై పంజాబ్ ప్రభుత్వం ఉక్కుపిడికిలి బిగిస్తోంది. గత ఐదు రోజుల్లో ఆరవ ఎన్‌కౌంటర్ శుక్రవారంనాడు చోటుచేసుకుంది. పంజాబ్ పోలీసులకు, కారు దొంగలకు మధ్య మొహాలీలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కరడుకట్టిన నేరస్థులు పట్టుబడ్డారు.