Home » Protest
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.
హిజ్బుల్లాకు మద్దతుగా వందలాది మంది బుద్గావ్‌లో ఆదివారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మరోవైపు, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మృతికి నిరసనగా ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్టు పీడీపీ చీఫ్ మొహబూబా ముఫ్తీ ప్రకటించారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ జరిగే వరకు తాను నిద్రపోనని, సీఎం రేవంత్ రెడ్డిని నిద్రపోనీయనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. రైతుబందు కేసీఆర్ హయంలో నాట్లకు అందిస్తే, ఈ ప్రభుత్వం పంట కోతకు వచ్చినా రైతుబందు రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయంలో దొంగరాత్రి కరెంట్ ఇస్తుంటే.. కేసీఆర్ కడుపు నిండా కరెంట్ ఇచ్చారని అన్నారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి ఘటనపై జూనియర్ డాక్టర్ల నిరసనతో తలెత్తిన ప్రతిష్ఠంభన 33వ రోజైన బుధవారంనాడు కూడా తొలగలేదు. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానించడాన్ని స్వాగతిస్తూనే మరిన్ని కొత్త డిమాండ్లు తెరపైకి తెచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఘటనపై వైద్యులు చేపట్టిన నిరసన బుధవారంతో 33వ రోజుకు చేరుకుంది. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ ఇదే సమయంలో ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు గుర్తించి, ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను అరెస్టు చేసింది.
సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
మణిపూర్(Manipur)లో శాంతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న నిరసనల మధ్య రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. దీంతోపాటు సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ను నిషేధించారు. ఈ క్రమంలో సెప్టెంబరు 11, 12న పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
జీవో 85కు వ్యతిరేకంగా పీహెచసీల్లోని వైద్యులు మంగళ వారం నల్లరిబ్బన ధరించి నిరసన వ్యక్తం చేశారు. పదో తేదీ నుంచి ఆందోళన చేస్తామని తెలిపారు.
ఇరవై ఏళ్ల క్రితం ఇదే రోజున కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము అమలులోకి వచ్చిందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయిశ్రీనివాస్ పేర్కొన్నారు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహ దినంగా నిర్వహిస్తారని తెలిపారు.
గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన, బెల్ కంపెనీలకు భూములు ఇచ్చిన రైతులకు ఆర్‌అండ్‌ఆర్ చట్టం అమలు చేసి, పరిహారం అందించాలంటూ భూనిర్వా సితులు చేపట్టిన వంటావార్పు నిరసన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. వారు సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండురోజల నిరసన క్యాక్రమాన్ని మంగళవారం చేపట్టిన విషయం విదితమే. రెండో రోజు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు వెంకటేశ, మహిళా సంఘం జిల్లా గౌరవాధ్యక్షురాలు దిల్‌షాద్ హాజరై ప్రసంగిం చారు.