Home » Prime Minister
మాజీ ప్రధాని థాక్సిన్ కుమార్తె పేటోంగ్‌టార్న్ షినవత్రా(Paetongtarn Shinawatra)ను థాయ్‌లాండ్(Thailand) పార్లమెంటు ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. 37 ఏళ్ల వయస్సులో ఆమె దేశంలోని అతి పిన్న వయస్కురాలిగా ఎంపికయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్ ప్రధానమంత్రికి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిద సంచలన ప్రకటన చేశారు. ప్రధాని పదవి నుంచి తాను వైదొలగనున్నట్టు బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. వచ్చే నెలలో జరిగే అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల్లో సైతం తాను పోటీ చేయడం లేదని వెల్లడించారు.
థాయ్‌లాండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ను పదవి నుంచి రాజ్యాంగ కోర్టు బుధవారంనాడు తొలగించింది.
బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..
బంగ్లాదేశ్‌కు పట్టిన రాక్షసి పీడా వదిలిందని కొన్ని రోజుల క్రితం దేశం వదిలి పారిపోయిన గత ప్రభుత్వాధినేత హసీనాను అభివర్ణిస్తూ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనుస్ అన్నారు.
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
రిజర్వేషన్ల కోటా ఆంశం బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా పీఠాన్నే కుదిపేసింది. ఢాకాలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంపై రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనకారులు విరుచుకుపడటంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి, వెంటనే సైనిక విమానంలో దేశం విడిచి అజ్ఞాత ప్రాంతానికి తరలివెళ్లిపోయారు. ఇదంతా కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది.
అమెరికా అధ్యక్ష రేసులోకి కమలా హారిస్ వచ్చాక వారం వ్యవధిలోనే ఆమె ప్రచారం కోసం రూ.1,674.45 కోట్ల(200 మిలియన్ డాలర్ల) విరాళాలు వచ్చాయి. ఆమె ప్రచార బృందం ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
కేంద్ర బడ్జెట్-2024లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. "కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు" అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
నేపాల్ కొత్త ప్రధానిగా సీపీఎన్-యూఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలి తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలిని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆదివారంనాడు నియమించారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లోని ప్రధాన భవంతి శీతల్ నివాస్‌లో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో కొత్త ప్రధానమంత్రిగా ఓలి ప్రమాణస్వీకారం చేయనున్నారు.