• Home » Pressmeet

Pressmeet

Dhulipalla: పీఎస్సార్.. వైఎస్సార్ ఆంజనేయులుగా వ్యవహరించారు..

Dhulipalla: పీఎస్సార్.. వైఎస్సార్ ఆంజనేయులుగా వ్యవహరించారు..

పీఎస్ఆర్ ఆంజనేయులు గత ప్రభుత్వంలో ఏసీబీ డిజీగా ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించి తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే కాకుండా, గతంలో తనతో విభేదాలున్న వ్యక్తులు, మహిళలను తన అధికారాన్ని ఉపయోగించి తప్పుడు కేసులతో అరెస్ట్ చేసి వేధించారని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.

Purandeswari: సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్‌పై ఉన్నారు..

Purandeswari: సోనియా, రాహుల్ ఇదే కేసులో బెయిల్‌పై ఉన్నారు..

సోనియా గాంధీ, రాహుల్ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చేర్చడంపై కాంగ్రెస్ రాద్దాంతం చేస్తోందని, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ బెయిల్‌ప ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి అన్నారు.

Good News: పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

Good News: పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడేను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పాస్టర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. వారికి ప్రతి నెల రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలో 8 వేల మందికిపైగా పాస్టర్లకు లబ్ది చేకూరనుంది.

MP Appala Naidu: సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి భాష బాధాకరం..

MP Appala Naidu: సీఎంగా చేసిన వ్యక్తి ఇలాంటి భాష బాధాకరం..

దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయితం చంద్రబాబు అంటే అభివృద్ధి, నమ్మకానికి బ్రాండ్ అని చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. భయం, అసూయతో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నమ్మకం, విశ్వాసం అని జగన్ చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు.

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

CM Revanth Reddy: చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారని, హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారని, రైతు బాంధవుడిగా ప్రజలు వైఎస్‌ను గుర్తుంచుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Miniser Kollu Ravindra: ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

Miniser Kollu Ravindra: ఏపీలో ఢిల్లీకి మించిన లిక్కర్ స్కామ్..

బెల్టు షాపుల మీద ఉక్కు పాదం మోపుతున్నామని, బెల్టు షాపు అనుబంధంగా ఉన్న షాపుల లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హత్యలు, అక్రమ కేసులతో రెచ్చిపోయారని, 44 రోజుల పాటు తాను కూడా రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పారు.

 Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

Manchu Manoj: నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలన్నది అతని లక్ష్యం..

తమది ఆస్తుల గొడవ కాదని.. స్టూడెంట్ విషయాల్లో ప్రారంభమైన గొడవ అని మంచు మనోజ్ తెలిపారు. తన ఇంట్లో జరిగిన బీభత్సంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. మీరు ఇక్కడ ఉండడం లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు అయినా పహాడీ షరీఫ్ ఇన్స్‌పెక్టర్ ఒక్క ఛార్జ్ షాట్ కూడా ఫైల్ చేయలేదుని ఆరోపించారు.

Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం

Karumuri: మీ ఇంటికి ఎంత దూరమో.. మా ఇంటికి కూడా అంతే దూరం

వైఎస్ఆర్‌సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేతల్ని కొడతాం, చంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కారుమూరి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

Bandi Sanjay: మాది దేశ భక్తి పార్టీ, ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ

హెచ్‌సీయూ భూముల మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి ఎవరని.. మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రబ్బర్ స్టాంప్‌లు అని, మంత్రి వర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశ భక్తి పార్టీ అని.. ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని ఆయన అభవర్ణించారు.

AP News విద్యుత్ షాక్‌తో ఇద్దరు ఉద్యోగులు మృతి.. మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

AP News విద్యుత్ షాక్‌తో ఇద్దరు ఉద్యోగులు మృతి.. మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి