Home » Pressmeet
Tirumala slogan controvers: తిరుమల క్యూలైన్‌లో భక్తులు అసహనంతో నినాదాలు చేసిన అంశాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. క్యూ లైన్లో వైసీపీ నాయకుడు అచ్చారావు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశారు. అతనిపై ఇప్పటికే పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు.
Minister DBV Swamy:ప్రజల మీద వైసీపీ ధర్నాలు చేయడం సరికాదని, జగన్ ప్రభుత్వంలో ఏ పథకం కూడా సక్రమంగా అమలు కాలేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి మహిళలకు శుభవార్త చెప్పారు.
YS Sharmila: ఎంత క్రమశిక్షణతో పేపర్లు దిద్దారో తెలుస్తోందని.. ఫలితాల్లో పారదర్శకత లేదని స్పష్టం అయిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు. వాస్తవానికి ఫెయిల్ అయ్యింది విద్యార్థులు కాదని..
Mahanadu: పులివెందుల (Pulivendula)లో మహానాడు (Pulivendula) టీడీపీ తోరణాలను (TDP Banners) తొలగించిన వైసీపీ శ్రేణుల (YCP Activists)పై పోలీసులు కేసు (Police Case) నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Avinash Reddy) పీఏ రాఘవరెడ్డి (PA Raghav Reddy), మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్ (Varaprasad)లతోపాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 191,2. 191,3. 324,4.109 రెడ్ విత్ 190 బీఎంఎస్ సెక్షన్ల కింద పులివెందుల పోలీసులు కేసులు నమోదు చేశారు.
MP Raghunandan Rao: తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కడా లేదని, బీఆర్ఎస్ చెల్లని రూపాయని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న పెయిడ్ బ్యాచ్‌లపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టిస్తున్నారని.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఆరోపించారని ఆయన అన్నారు.
Lanka Dinakar: భారత్ ఆయుధాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, 2047 నాటికి భారత్‌ను విశ్వ గురువుగా నిలిపేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని ఏపీ బీజేపీ నేత లంక దినకర్ అన్నారు.
Deputy CM Bhatti Vikramarka: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి ఒకేసారి 3,500 కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Jagadish Reddy: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని విమర్శించారు.
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం హాయాంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, సాగునీటి ప్రయోజనాలు కాపాడటంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని.. మౌనంగా ఉండి.. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని హరీష్ రావు ఆరోపించారు.
MP Laxman: ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయని, అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.