Home » Pressmeet
Raja Singh statement: తాను బీజేపీ తప్ప వేరే పార్టీలోకి వెళ్లనని ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనతో కొంతమంది ఆట ఆడుతున్నారని.. తాను వేరే పార్టీలోకి వెళ్లనన్న విషయం వాళ్లకు తెలుసునని.. అందుకే వాళ్లు తన నియోజకవర్గంలో ఏమైనా చేయొచ్చుననే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అన్నారు.
Kotamreddy: పోరాటాలు చేసే వారిపై సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యలు ఆయనవి కావని.. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలుగానే తాను భావిస్తున్నానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సజ్జల.. జగన్ దగ్గర గుమస్తా అని.. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి అని అన్నారు.
Bonalu festival: గతంలో జరిగిన దానికంటే ఈసారి ఇంకా మంచిగా బోనాల ఉత్సవాలు జరపాలని అనుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. సరస్వతి పుష్కరాలు కూడా అద్భుతంగా నిర్వహించామని.. పక్క రాష్ట్రాల భక్తులు కూడా ఎంతో అభినందించారని మంత్రి అన్నారు.
Rayapati Sailaja: జర్నలిస్టు ముసుగులో మహిళలపై ఇంత నీచంగా మాట్లాడతారా.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను అవమానపరిచారని ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ అనే పేరుతో నోరు పారేసుకుంటారా.. మీ ఇళ్లల్లో మహిళలను కూడా ఇలాగే అనగలరా అని ఆమె ప్రశ్నించారు.
Mudragada: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తోందంటూ ఆయన తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Minister Lokesh: విద్య, వైద్య, విజ్ఞాన, ఉపాధి వికాస రంగాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో ఆర్డీటీ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
PM Modi: రానున్న రోజుల్లో భారత్ పెద్ద వ్యాపార, వాణిజ్య దేశంగా మారబోతోందని, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా కేంద్ర మంత్రులంతా విధిగా ఆయా ప్రాంతాల్లో ఒక్క రోజు గడపాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Gowru Charitha Reddy: కుంభకోణాల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికే వైసీపీ వెన్నుపోటు ధర్నా డ్రామాలు ఆడుతోందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. అసలైన వెన్ను పోటు దారుడు జగన్ రెడ్డి అని.. వెన్నుపోటు అంటూ ధర్నాలు చేయడం దొంగే దొంగ అన్నట్లు ఉందని, గొడ్డలి పోటు దినం కూడా జరుపుకోవాలని ఆమె హితవు పలికారు.
Kutami Leaders: ఏపీలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సుపరిపాలన 4 ఏళ్ళు కొనసాగాలని కూటమి నేతలు ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయమని, కూటమి రాష్ట్రంలో 30 ఏళ్లు పరిపాలిస్తుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Minister Dola: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను అన్ని విధాలా మోసం చేసిన జగన్‌కు వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ ఎమ్మెల్యే అయిన తనపై ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేస్తుంటే వెకిలి నవ్వు నవ్వుకుంటూ జగన్ కూర్చున్నారని.. ఇప్పటికైనా తీరు మారకుంటే ఆ 11 కూడా రావని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.