Home » Pressmeet
జాతీయ కౌన్సిల్ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సీఐఐ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో మహిళాభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ధ్రిగ్బాంతికి గురి చేసిందని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
అమరావతి: తిరుపతి ఘటనపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి ఆనం అమరావతి నుంచి మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు హుటాహుటీన తిరుపతికి చేరుకున్నారు.
విశాఖ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విజనరీ ఉన్న నేతని, సంపద సృష్టించి పేదరికాన్ని రూపుమాపాలని ఆలోచించే నాయకుడని అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంచి హృదయం ఉన్న నాయకుడని, పేద ప్రజలను చూస్తే కరిగిపోయే మనస్సున్న నేతని అన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఉన్న విషయం వాస్తవమని.. దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తోందని, గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ సందేహపదవద్దని మీడియాకు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
కాంగ్రెస్ కోతలపాలన.. ఎగవేతల ప్రభుత్వంమని, రైతు రుణ మాఫీ.. రైతు భరోసా అన్ని ఎగవేతలేనని, ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని.. ఇప్పుడు రూ. 12 వేలకు కోత పెట్టారని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. మాయ మాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారెంటీలన్ని నీటి మూటలేనని విమర్శించారు.
పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని జేపీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
సినిమా విడుదలైనప్పుడు హీరోలు వస్తే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో హీరోలు వెళ్ళకపోవడమే మంచిదని ఏపీ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా చూసుకోవలసిన అవసరం ఉందన్నారు.
ప్రకాశం జిల్లా: టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2‘ చిత్రం విడుదల కావడంతో ఓ హీరోగా ఆయన థియేటర్ సినిమా చూసేందుకు వెళ్ళారని, అప్పుడు జరిగిన ప్రమాదం ఆయన ప్రేరేపించింది కాదని, బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
కూటమి ప్రభుత్వం ఎంత ఖర్చయినా గోదావరి - పెన్నా పూర్తి చేసి, రాయలసీమను రతనాల సీమగా మార్చుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాయలసీమ బిడ్డ అని చెప్పు కుంటూనే, గతంలో ఏ ముఖ్య మంత్రి చేయని ద్రోహం జగన్ మోహన్ రెడ్డి చేశారని మంత్రి విమర్శించారు.