Home » Prashant Kishor
పాట్నాలోని చారిత్రక గాంధీ మైదానం వద్ద ప్రశాంత్ కిషోర్ లగ్జరీ వ్యాన్ ఉండటం ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. కోట్ల రూపాయలు విలువచేసే ఈ వ్యానులో ఏసీ, కిచెన్, బెడ్రూం వంటి సకల సదుపాయాలు ఉన్నాయి.
బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన ప్రశాంత్ కిషోర్, విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాననే నినాదంతో గత అక్టోబర్ 2వ తేదీన 'జన్ సూరజ్' పార్టీని ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మాజీ ఐఎఫ్ఎస్ అధికారి మనోజ్ భారతిని ప్రకటించారు.
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మధుబనిలో జన్మించిన మనోజ్ భారతికి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. డిప్లమోటిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. జముయిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ఆయన ఐఐటీ కాన్పూర్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి ఎంటెక్ చేశారు.
జన్ సురాజ్‌ను ''జన్ సురాజ్ పార్టీ''గా ఎన్నికల కమిషన్ అధికారికంగా ఈరోజు ఆమోదించిందని పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
జన్ సురాజ్ నేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పేరు, నాయకత్వం తదితర వివరాలను అక్టోబర్ 2వ తేదీన ప్రకటిస్తామని తెలిపారు.
అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆదివారంనాడు మాట్లాడుతూ, 2న పార్టీ ఆవిర్భావం కోసం ప్రత్యేక సన్నాహకాలు అవసరం లేదని, రెండు సంవత్సరాలు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.
రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ తన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు బహిరంగ చర్చల సందర్భంగా చాలాసార్లు బీహార్(bihar)లో ప్రకటించారు. కానీ తాజాగా మాత్రం RJD నేత తేజస్వి యాదవ్‌కు సవాల్ విసిరారు. అయితే ఏమన్నారనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తమ 'జన్ సురాజ్' పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, వీరిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని తెలిపారు.