Home » Prajwal Revanna
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna Scandal) పాస్‌పోర్టు రద్దు(Passport Seize) చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(MEA) శుక్రవారం లేఖ రాసింది.
రాసలీల వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వెంటనే భారత్ తిరిగి వచ్చి.. పోలీసులకు లొంగిపోవాలని అతడి తాత, మాజీ ప్రధాని దేవగౌడ సూచించారు. లేకుంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని ప్రజ్వల్‌ను ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్యపరమైన పాస్‌పోర్ట్ రద్దుకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్వ్ రేవణ్ణ పాస్‌పోర్ట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్‌పై బెంగళూరు నగరంలోని 42వ ఏసీఎంఎం కోర్టు శనివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు దాఖలు చేసిన నోటీసుల గురించి కోర్టు..
రాసలీలల వివాదంలో చిక్కుకున్న ప్రజ్వల్‌పై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదు అని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. తన 91వ జన్మదినం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం పూజలు జరిపించారు.
కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ప్రజల్వ్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మౌనం వీడారు. ఈ కేసులో మరింత మంది ప్రమేయం ఉందనే సంకేతాలిచ్చారు. ఈ కేసులో ఎవరెవరికి ప్రమేయం ఉందో వారందరిపైన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే వారి పేర్లు తాను చెప్పదలచుకోలేదన్నారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌ల వ్యవహారంలో 'సిట్' విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రమేయమున్నట్టు అనుమానిస్తున్న చేతన్, లిఖిత్ అనే ఇద్దరు వ్యక్తులను హసన్‌లో ఆదివారంనాడు అరెస్టు చేసింది.
లోక్‌సభ ఎన్నికల మధ్యలో సంచలనం సృష్టించిన హస్సన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర రాజకీయ పార్టీలు, నేతలకు అదివారంనాడు కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కాని, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని కోరారు.