Home » Power Bill
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
ఉచిత/రాయితీతో విద్యుత్ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ పథకం కింద ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్/ఫోన్‌పే/అమేజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు.
కరెంటు బిల్లులను ఇకపై గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీయం, బిల్‌డె్‌స్కలో చెల్లించడానికి వీల్లేదని డిస్కమ్‌లు తేల్చిచెప్పాయి.
రాష్ట్రంలో సోమవారం నుంచి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే తదితర యాప్‌ల ద్వారా విద్యుత్ వినియోగదారులు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఆన్ లైన్ యాప్‌ల ద్వారా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ( TGSPDCL ) విద్యుత్ బిల్లులను స్వీకరించడాన్ని బ్యాంకులు నిలిపేశాయి .
విద్యుత్తు సంస్థలకు మోయలేని భారంగా మారుతున్న బకాయిలు, నష్టాలను తగ్గించుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)లో భారంగా మారిన పలు సర్కిళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే యోచనలో ఉంది.
గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో ఛత్తీ్‌సగఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్తు సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు రూ.6 వేల కోట్ల మేర ఆర్థికభారం పడినట్లు అంచనా వేశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహజ్యోతి పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తే ఛార్జీ వేయరు. లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందు చాలా మంది ప్రజాపాలన దరఖాస్తు చేశారు. కొందరికి మాత్రం గృహజ్యోతి పథకం అమలు కాలేదు. అలాంటి వారు అప్లై చేసుకునే అవకాశం ఇస్తోంది.
హైదరాబాద్(Hyderabad) వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు(Power Supply) అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు(Electricity Department Officials) తెలిపారు. దాదాపు గంటన్నర పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని తెలిపారు. ఇంతకీ ఏ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది? కారణమేంటి? అనే వివరాలు తెలుసుకుందాం..