Home » Ponnam Prabhakar
మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లోని అడ్వెంచర్ క్యాంప్ శిక్షణకు ఎంపికైన మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం ఘనంగా సన్మానించారు.
కవిత లేఖతో కేటీఆర్ చిన్న మెదడు చితికిందని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. కవిత చెప్పినట్టుగా కేసీఆర్ దగ్గర ఉన్న దయ్యం నువ్వేనా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ మరియు పుణ్యక్షేత్రాలకు త్వరలో బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ముంబైకి రెండు లహరి ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు ప్రారంభించారు.
అనాథాశ్రమాల్లో ఉంటున్న పిల్లలు ఆత్మవిశ్వాసంతో చదువుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని పిల్లలకు ఆమె భరోసా ఇచ్చారు.
Kishan Reddy: హైదరాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. హైదరాబాద్ జనాభా 33 శాతానికి చేరిందని అన్నారు. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నందున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.
ఎటువంటి చర్చలేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఒక ట్వీట్‌తో యుద్ధం ఎందుకు ఆపారో జాతికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
బీసీలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయమే చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ పార్టీలో అధికార పదవుల్లో బీసీలకు అవకాశం కల్పించని బీజేపీ..