Home » Politicians
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కులగణనకు రాహుల్ గాంధీనే దేశ హీరో అని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిర్ణయం ప్రశంసనీయం అయినా, కులగణన క్రెడిట్ మాత్రం రాహుల్‌కే చెందుతుందని అన్నారు.
తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన అశాస్త్రీయమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ముస్లింలలోని 10 శాతం మందిని బీసీలుగా చూపడం బీసీలకు అన్యాయమన్నారు.
మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఎంపీ, ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మధ్య మంత్రి సమక్షంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ‘‘నా నియోజకవర్గంలో జోక్యం ఏమిటి?’’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎంపీ కూడా తీవ్రంగా స్పందించారు.
దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. శాసనసభ్యుల్లో జీడీనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు థామ్‌స,ఎమ్మెల్యే మురళీమోహన్ మాత్రమే పాల్గొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్లబ్‌కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తమకు తెలియకుండా కలెక్టర్‌కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్‌రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.
ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ నుంచి తీసుకున్న రూ.310 కోట్ల రుణానికి బుట్టా రేణుక దంపతులు ఐదేళ్లుగా కంతులు చెల్లించకపోవడంతో వారి ఆస్తులు వేలానికి సిద్ధమయ్యాయి. గతంలో వేలం పెట్టిన ఆస్తులకు స్పందన లేకపోయినప్పటికీ మరోసారి వేలానికి రంగం సిద్ధమైంది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోతే బీజేపీకి ఎలాంటి లాభం లేదని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో భూములు, మద్యం అమ్మకాలు, అప్పుల ద్వారా వ్యవస్థ నడుస్తోందని విమర్శించారు. కిషన్‌రెడ్డి బీజేపీ కొత్త అధ్యక్షుడిని త్వరలో నియమించనున్నట్లు చెప్పారు
తెలంగాణ ప్రభుత్వం మీద ఫేక్ పోస్టుల ప్రచారం కోసం విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, 25 మంది కీలక పాత్రధారులు ఉన్నారని సైబర్ క్రైం బృందాలు తెలిపారు. ఈ కేసులో సంబంధిత న్యూస్ సైట్లు, సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం