Home » Politicians
విద్యా వ్యవస్థలో మార్పులకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయో సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై చంద్రబాబు సంతకం చేశారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఆయన్ను చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలవుతున్నా హామీల ఊసే లేదని మండిపడ్డారు.
రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు సహాయ కార్యదర్శులకు ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జీవోను జారీ చేశారు.
దళితులు జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలవైపు మొగ్గు చూపినట్టు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫలితాలపై సీఎ్‌సడీఎస్ సర్వే సంస్థ జరిపిన అధ్యయనం ప్రకారం దళితులు బీజేపీకన్నా ఇతర పార్టీలను ఆదరించారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు యడియూరప్పపై బెంగళూరు కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉంది. సాయం కోసం కుమార్తె(17)తో కలిసి తాను ఈఏడాది ఫిబ్రవరి 2న యడియూరప్ప ఇంటికి వెళ్లగా తన కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో సదాశివనగర్ పోలీసులు మార్చి 14న ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇకపై ల్యాండ్ క్రూయిజర్ కార్లలో ప్రయాణించనున్నారు. పూర్తిస్థాయి బుల్లెట్ ప్రూఫ్‌తోపాటు శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ల్యాండ్ క్రూయిజర్లను మంత్రులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో తన కాన్వాయ్ కోసం రూ.66 కోట్లతో 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లను కొనుగోలు చేశారు.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
మంత్రులంతా ప్రజలకు నచ్చేలా అణకువగా, హుందాగా ఉండాలని, విధి నిర్వహణలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని కేంద్ర నూతన మంత్రి వర్గానికి ప్రధాని మోదీ సూచించారు. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేందుకు మంత్రి వర్గమంతా కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.