Home » Police case
యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 15 వందలకుపైగా ఐఫోన్లు చోరీ అయ్యాయని పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు.
ఉద్యోగ పరిధిని అతిక్రమించి.. స్థల వివాదంలో జోక్యం చేసుకున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహనగరంలోని కర్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఒక ఎస్సైతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది.
కోల్‌కతా హత్యాచార ఘటనాస్థలంలో ఆధారాలను తారుమారు చేశారంటూ సీబీఐ చేసిన ఆరోపణలను కోల్‌కతా పోలీసులు తోసిపుచ్చారు.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అయిదు రోజుల కిందట జన్మించిన శిశువును విక్రయించాలని నాగ్‌పూర్‌లోని దంపతులు సునీల్, శ్వేత నిర్ణయించారు. ఆ క్రమంలో స్థానిక మధ్యవర్తులను సంప్రదించారు. థానే జిల్లాలోని బద్లాపూర్‌లో మధ్యవర్తలు బంధువులు పౌర్ణిమా, స్నేహదీప్ దంపతులు ఆ శిశువును కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న ఓ ముఠాను హెచ్-న్యూ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా.. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రూ.8.5 కోట్ల విలువ చేసే 8.5 కిలోల ఆమ్‌ఫెటమైన్ డ్రగ్స్‌ను సీజ్ చేశారు.
మూడు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాలలో స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది. ఈ కేసును గురువారం సుమోటోగా విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు..
విశాఖలో కొందరు ఆగంతకులు రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. పెందుర్తి, తగరపువలసలో రెండు చోట్ల కలిపి మొత్తం రూ.33లక్షలు అపహరించుకుపోయారు.
ట్రావెల్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులే లక్ష్యంగా నిమిషాల్లో కోట్లాది రూపాయలను కొల్లగొట్టే థార్‌గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు(Rachakonda Police) ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు.
రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్ చేస్తుండగా బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.
వరుస ఏసీబీ దాడులు, ఇటీవల అవినీతి ఆరోపణలతో ప్రతిష్ఠ మసకబారుతున్న సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ప్రక్షాళనకు నగర సీపీ కొత్తకోట శ్రీనివా్‌సరెడ్డి శ్రీకారం చుట్టారు. కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై ర్యాంకు వరకు 81 మందిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.