Home » Police case
ములుగు జిల్లా, వాజేడు మండలం ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో వేరే పెళ్లి సంబంధం చూస్తుండడంతో ఎస్ఐ మనస్థాపానికి గురయ్మారు. పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై గన్‌తో కాల్చుకొని చనిపోయారు. దీంతో ఎస్ఐ హరీష్ స్వంత గ్రామం గొరికొత్తపల్లి మండలం, వెంకటేశ్వర్లుపల్లిలో విషాదం నెలకొంది.
కన్నడ నటి శోభిత మృతి కేసులో విచారణ చేస్తున్న గచ్చిబౌలి పోలీసులకు ఘటనా స్థలంలో సూసైడ్ నోటు లభ్యమైంది. ఆ సూసైడ్ నోట్లో ‘మీరు చావాలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అని రాసుకున్న శోభిత.. సూసైడ్ నోటు ఆధారంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శోభిత మృతికి డిప్రెషన్ కారణమా... భర్తతో విభేదాలా... సీరియల్స్ మూవీస్‌కు దూరంగా ఉండటమా.. అనే దానిపై విచారణ చేస్తున్నారు.
ములుగు ఏజన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. మరోవైపు సోమవారం నుంచి మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులను నిలిపివేశారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బాపట్లలో సూర్యలంక బీచ్‌లో దళితుడిని ఆర్కే రోజా అవమానించిందని ఆయా సంఘాలు ఆరోపించాయి.
సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ (ఆర్జీవీ) ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వర్చువల్ విచారణకు అంగీకరించే అవకాశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ముందస్తు బెయిల్‌పై గురువారం హైకోర్టులు విచారణ జరగనుంది.
ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ.. ఒంగోలు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది.
ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చొని ఎడవటం లేదని రాంగోపాల్ వర్మ అన్నారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలో దెబ్బతిన్నాయ్... తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.
గత వారం రోజులుగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కితే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనే భయాందోళనలో ఆయన ఉన్నట్లు ఓ చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా సాగుతుంది.
మైనర్ బాలికపై అటమ్ట్ రేప్ జరిగిందని దుష్ర్పచారం చేయడంతో.. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతోపాటు బాలిక భవిష్యత్‌ను దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోసారి పోలీసు విచారణకు డుమ్మాకొట్టారు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు ఎస్ఐలతో పాటు ఆరుగురు పోలీసులు వర్మ ఇంటికి చేరుకున్నారు. మార్ఫింగ్ కేసులో రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.