Home » Police case
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్‌సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓ యువకుడు తన సెల్పీ వీడియోలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు.. అయితే ఇంత వరకు అతని ఆచూకీ లభ్యం కాలేదు. అప్పులు చేసి ఆన్ లైన్ బెట్టింగ్ ఆడానని.. అప్పుడు తీర్చే మార్గం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ కసాయి తల్లి అప్పుడే పుట్టిన శిశువును రోడ్డుపై వదిలేసింది. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూదేవినగర్ పోచమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది.
గన్నవరం టీడీపీ కార్యాలయం విద్వంసం కేసులో ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ కిడ్నాప్‌లో కీలక ఆధారాలు పోలీసులు సంపాదించారు. కోర్టు కంప్లెక్ వద్దకు సత్యవర్ధన్‌ను తీసుకువచ్చిన వాహనం, అందులో వచ్చిన వంశీ అనుచరుల వివరాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు సేకరించారు. సత్యవర్ధన్‌ను నగరంలో ఎక్కడెక్కడ తిప్పారనే అంశంపై కూడా సాంకేతిక ఆధారాలు సేకరించారు.
రిమాండ్ ఖైదీగా ఉన్న మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు రెండో రోజు శుక్రవారం విచారిస్తున్నారు. మస్తాన్ సాయికి చెందిన హార్డ్ డిస్క్‌ను ఓపెన్ చేసి, అందులో వివరాలు సేకరించనున్నారు. హార్డ్ డిస్క్‌లో ఏముంది. లావణ్య చెప్పినట్లు అశ్లీల రికార్డింగులు ఉన్నాయా.. మొత్తం ఎన్ని వీడియోలు ఉన్నాయి.. అన్న విషయంపై పోలీసులు ఆరా తీయనున్నారు.
రాజ్‌తరుణ్-లావణ్య కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై బదిలీ వేటు పడింది. ఆయనపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ.. సైబరాబాద్ సీపీ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.
హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో భారీగా క్యాసినో, కోడి పందాలు ఆడుతున్నవారిపై రాజేంద్రనగర్ పోలీసులు ఛేదించారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు.
సాక్షులను నిర్దిష్ట తేదీల్లో న్యాయస్థానాల్లో హాజరుపరచడంలో దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయి..
స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత హెచ్.రాజా(Senior BJP leader H. Raja)పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.