Home » Polavaram
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం నేలకోట ప్రాంతంలో పెద్దపులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచరిస్తున్నట్లు ధృవీకరించిన అధికారులు.. దాన్ని బంధించేందుకు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టారు.
పోలవరం జిల్లా నేలకోట, పుడిపల్లి ప్రాంతంలో సంచరిస్తున్న పులి కదలికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక హనుమాన్ బృందాలు రాత్రంతా అప్రమత్తంగా పనిచేశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం పరిధిలో ఉన్న గంగంపాలెం గ్రామం సమీప ప్రాంతాల్లో పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. గత కొద్ది రోజులుగా అటవీ ప్రాంతాల నుంచి గ్రామాల వైపు వస్తున్న పెద్దపులి మూగజీవాలపై వరుసగా దాడులు చేస్తోంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమావేశమయ్యారు. పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పని తీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఒకటిగా ఉన్న గోదావరి-కావేరీ అనుసంధాన ప్రాజెక్టును రెండు భాగాలుగా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందులో ఒక భాగం సమ్మక్క సాగర్ నుంచి నాగార్జున సాగర్ దాకా కాగా.. రెండోది పోలవరం నుంచి చేపట్టేది...
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది. పునరావాస పనుల కోసం తాజాగా మరో రూ. 600 కోట్లు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రాల మధ్య సాగునీటి వాటాల కోసం వివాదాలు సహజమేనని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సీఎం చంద్రబాబుకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య మరోసారి పోలవరం ప్రాజెక్టు వివాదం ముదురుతోంది. పోలవరం ఫేజ్-2 పనులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
పీపీఏ, సీడబ్ల్యూసీ నిర్దేశించిన గడువు ప్రకారం 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేసినట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చడంలో పోలవరం కీలకమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటున్నారు. పలువురు కేంద్రమంత్రులను ముఖ్యమంత్రి కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ధి పనులపై చర్చిస్తున్నారు.