Home » Pithapuram
పిఠాపురం నియోజకవర్గ (Pithapuram Constituency) ప్రజల్ని ఈనెల 20వ తేదీ తర్వాత కలవనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్‌గా తీసుకున్నారు..
పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు.. జనసేన ఒక పార్టీనా అంటూ ఎంతోమంది ఐదేళ్ల క్రితం హేళన చేశారు. ఎదుటివారి విమర్శలకు కుంగిపోలేదు. వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలు చేసినా రాజకీయ రణరంగంలో వెనక్కి పారిపోలేదు. ఓడిపోయానంటూ హేళనచేసినవారికి తగిన గుణపాఠం చెబుతానంటూ సవాల్ విసిరారు.
ఏపీలో అధికారంలోకి రావాలంటే గోదావరి జిల్లాల్లో గెలవాలనేది ఒక సెంటిమెంట్. ఈ రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు గెలిచిన పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి ఓటమి తప్పదని.. అసహనంతోనే హింసకు పాల్పడుతున్నారని జనసేన నేత నాగబాబు (Naga Babu) అన్నారు. ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రత పెంచాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. హింసకు పాల్పడ్డ వైసీపీ నేతలే ఎన్నికల సంఘాన్ని, పోలీసులను నిందించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభల కోసం ఆ పార్టీ నాయకులు విధ్వంసానికి పాల్పడుతున్నారు. పిఠాపురంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీంతో...
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా ఉంది. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీయే కూటమి, మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే.. పవన్‌ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహలు రచిస్తోంది. ఈక్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు.