• Home » Phone tapping

Phone tapping

Phone Tapping Case: ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్

Phone Tapping Case: ట్రంప్ సంతకంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్

Phone Tapping Case: అమెరికాలో వలసదారులు, క్రిమినల్ కేసులో నిందితులను ఆయా దేశాలకు అప్పగించాలని ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు రిమైండర్స్ లెటర్లను హైదరాబాద్ పోలీసులు పంపనున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే.

Delhi: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడికి బెయిల్..

Delhi: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడికి బెయిల్..

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆయనపై కేసు నమోదు అయ్యింది. దీంతో పోలీసులు అరెస్టు చేయగా దాదాపు 10 నెలలుగా జైలులోనే తిరుపతన్న ఉన్నారు.

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు

Phone Tapping: తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకంగా గవర్నర్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సీఐడీ అధికారులు సాంకేతిక ఆధారాలతో ముందుకెళ్తున్నారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణరావు ఇద్దరినీ రాష్ట్రానికి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులు ‘నేరస్తుల అప్పగింత’ అస్త్రంను ప్రయోగించనున్నారు.

 Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్.. ఎందుకంటే

Harish Rao: హైకోర్టులో హరీశ్‌రావు క్వాష్ పిటిషన్.. ఎందుకంటే

Harish Rao: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్వాష్ పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) హైకోర్టులో విచారణ జరగనుంది. పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు.

Phone Tapping Case: భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా

Phone Tapping Case: భుజంగరావు బెయిల్‌పై తీర్పు వాయిదా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్న ఏ-3 ఎన్‌.భుజంగరావు దాఖలు చేసిన రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది.

Phone Tapping: రెడ్‌కార్నర్‌ నోటీసుకు.. ఆలస్యం ఎందుకు?

Phone Tapping: రెడ్‌కార్నర్‌ నోటీసుకు.. ఆలస్యం ఎందుకు?

విదేశాల్లో ఉన్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నిందితులు ప్రభాకర్‌రావు(ఏ1), శ్రవణ్‌రావు(ఏ2)లపై రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయడానికి ఆలస్యమెందుకని హైకోర్టు పోలీసులను నిలదీసింది.

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు

High Court: ఫోన్‌ట్యాపింగ్‌ దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు

ఫోన్‌ట్యాపింగ్‌ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, ఈ దశలో ఏ-2గా ఉన్న దుగ్యాల ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావుకు బెయిల్‌ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది.

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం-  హరీష్‌రావు మెడకు ఆ కేసు ఉచ్చు ...

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం- హరీష్‌రావు మెడకు ఆ కేసు ఉచ్చు ...

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం విషయం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఈ కేసులో మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావుపై కేసు నమోదైంది. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టారు.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాలో ప్రభాకర్‌రావు పిటిషన్‌

సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి