Home » Payyavula Keshav
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. అసెంబ్లీకి 7 సార్లు గెలుపొందారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయం, సచివాలయంలో పేషి ఖరారు కావాల్సి ఉంది. జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంగా కన్ఫామ్ అవనుంది. సచివాలయంలో గల కార్యాలయాలను పవన్ కల్యాణ్ ఈ రోజు పరిశీలించారు. ఇంతలోనే పవన్ పేషీపై వార్తలు వస్తున్నాయి. అందుకు గల కారణం సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్ అని స్టిక్కర్ కనిపించడం.
అనంతపురం జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) హామీ ఇచ్చారు. తాను రాష్ట్రానికి మంత్రిని అయినా.. అనంతపురం జిల్లాకు కూలీనేనని తెలిపారు. తాగు, సాగునీటి కోసం జరిగిన పోరాటాల మధ్య తాను పెరిగానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి (Yanamala Ramkrishnudu)ని ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి(Finance Minister) పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రిత్య శాఖలు పయ్యావుల కేశవ్‌కు దక్కడంతో జిల్లాలో కొంగొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో పయ్యావుల కేశవ్ కీలక భూమిక పోషించనున్నారనడంలో సందేహం లేదు. ఆయనకు కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించడమే ఇందుకు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కరువు జిల్లా అనంతకు దక్కిన అరుదైన అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా చరిత్ర లో ఎంతోమంది మంత్రులుగా పనిచేసినా జిల్లాకు ఆర్థికశాఖ దక్కలేదు. ఆ అరుదైన అవకాశాన్ని పయ్యావుల కేశవ్ దక్కించుకున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ...
ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని కోరుకుంటున్నానని చెప్పారు.
: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియారిటి, సామాజిక సమీకరణాల ఆధారంగా శాఖల కేటాయింపు చేశారు. పయ్యావుల కేశవ్‌కు కీలక శాఖలు అప్పగించారు. మంచి వక్త అయిన కేశవ్‌కు నాలుగు శాఖల బాధ్యతలు అప్పజెప్పారు.
ఆయనది మూడు దశాబ్దాల రాజకీయం. ఎన్టీఆర్ పిలుపుతో 1994లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. అప్పటికి ఆయన వయస్సు 29 ఏళ్లు. యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో విషయ పరిజ్ఞానం పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన నోటి వెంట మాట వచ్చిందంటే తూటాలా పేలుతుంది. భాషపై పట్టు.. యాస, ప్రాసను సమపాళ్లలో పండించగల దిట్ట. మైక్ తీసుకున్నారంటే మాటాల్లో వాడి.. వేడి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనే ..
తనకు మంత్రి పదవి రావడంతో తన బాధ్యత మరింత పెంచిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్సష్టం చేశారు. ఈ సమాజానికి తిరిగి తాము ఏం చేయగలమనే ఆలోచనతోనే ఈ రోజు తమ ప్రస్థానం మొదలవుతుందని తెలిపారు.
నా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప.. ఉరవకొండ నియోజకవర్గంలో కొత్తగా చేసేందిమీ లేదు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తాను. సూపర్ సిక్స్ పథకాలే మా అస్త్రం. నియోజకవర్గంలో సాగు, తాగు నీటి సమస్యలకు పరిష్కారం చూపుతాను. హంద్రీనీవా నీటితో ఆయకట్టును కోనసీమ తరహాలో అభివృద్ధి చేస్తాను’ అని టీడీపీ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. ...