Home » Parliament Special Session
భారత ప్రజాస్వామ్యానికి ఏప్రిల్ 17 చీకటి రోజని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి తల్లి, అక్కా, చెల్లి, కుమార్తెకు ఈరోజు అవమాన దినమని పేర్కొన్నారు.
లోక్‌సభలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. విపక్ష నేతలందరూ ఏకమై ఒక ‘జాతీయ విపత్తును’ నివారించారని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ అంశంపై ఆయన ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం చర్చనీయాంశమైంది.
నారీ శక్తీ వందనం బిల్లుపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సాధికారిత బిల్లుపై, మహిళల అభివృద్ధి గురించి మాట్లాడమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అవహేళనగా మాట్లాడారని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఈ మేరకు విప్ జారీ చేసింది.
పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ ప్రసంగంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె స్పందించారు. ఏప్రిల్ 17 గురించి రాహుల్ ప్రస్తావించడాన్ని తప్పుబట్టడమే కాకుండా.. కులగణన గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు.
మహిళా సాధికారత దిశగా కేంద్రం మరో కీలక ముందడుగేసింది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుపై చర్చ జరగనుంది.
పార్లమెంట్ సమావేశాల్లో మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. మోదీ ప్రభుత్వం లోక్‌సభ సీట్ల పెంపుపైనే ఆసక్తి కనబరుస్తోందని ఆమె విమర్శించారు.
పార్లమెంట్ వేదికగా డీలిమిటేషన్ బిల్లుపై ప్రసంగించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రాన్ని అవమానించేలా మాట్లాడారంటూ అసభ్య పదజాలం వాడుతూ ఘాటుగా విమర్శించారు.