Home » Parliament Budget Session
గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందిందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అవినీతి కట్టడితో ప్రభుత్వం.. ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తోందన్నారు. ఇవాళ ఉభయసభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో పలు కీలక విషయాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
జనవరి 28తో ప్రారంభమయ్యే తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగుస్తాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9న తిరిగి ప్రారంభమై ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారంనాడు కేంద్ర బడ్జెట్ 2026-27ను ఉభయసభల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు పార్లమెంట్ సమావేశం కాబోతోంది. జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజున పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరగనుంది.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
కేంద్రప్రభుత్వం 2024లో వక్ఫ్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లను ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల తీవ్ర నిరసనల నేపథ్యంలో జేపీసీకి పంపేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు ఈ బిల్లును పంపింది.
రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు లోక్‌సభలో మంగళవారంనాడు జరిగిన చర్చలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకుంభ్ ఏర్పాట్లపై మాట్లాడానికి బదులుగా ఆ ఆవెంట్‌ను ప్రచారం చేసుకునేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బీజీగా ఉందన్నారు.
Budget 2025: ఇండియాకు గుర్తుగా.. వారసత్వం, స్వతంత్ర పరిపాలనకు గుర్తుగా భావిస్తారు. మన దేశ బడ్జెట్‌ను మనమే ప్రజెంట్ చేస్తున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని పాటిస్తూ 2019కి ముందు వరకు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. కానీ ఈ సంప్రదానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు.
బడ్జెట్ సమర్పణకు సమర్పణకు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీ కావడంతో 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి శనివారంనాడు ఉభయసభల్లో ప్రవేశపెట్టారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం (30వ తేదీ) కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ జరగనుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కొరనున్నారు.