Home » Paris
పారిస్ పారాలింపిక్స్ 2024(paralympics 2024)లో మూడో రోజు భారత్‌కు ఐదో పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్ 1 విభాగంలో భారత షూటర్ రుబీనా ఫ్రాన్సిస్(Rubina Francis) కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
పారాలింపిక్స్‌లో భారత్ రెండో రోజు నుంచే పతకాల వేట ఆరంభించింది. టార్గెట్-25 మెడల్స్ ధ్యేయంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు అంచనాలకు మించి రాణిస్తూ ఒక్క రోజే నాలుగు పతకాలతో ఖుషీ చేశారు. మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ విభాగంలో ‘డబుల్’ ఆనందాన్ని పంచారు. షూటర్ అవనీ లేఖారా వరుసగా
ప్యారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు నాలుగో పతకం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం గెల్చుకున్నాడు. మరోవైపు మహిళల 100 మీటర్ల (టీ35) రేసులో భారత్‌కు చెందిన ప్రీతీ పాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
వైకల్యం వెక్కిరించినా కుంగిపోకుండా.. కాలం నేర్పిన గుణపాఠాలను సవాల్ గా తీసుకొని.. అవరోధాలను అనుకూలంగా మార్చుకున్న పోరాట యోధులు వీళ్లు. ప్రోత్సాహం అంతగా లేకున్నా, అందుబాటులో ఉన్న వనరులను....
దాదాపు మూడు వారాల పాటు సాగిన ఉత్కంఠభరితమైన పారిస్ ఒలింపిక్స్(paris olympics 2024) గేమ్స్ నేటి రాత్రితో(ఆగస్ట్ 11న) ముగియనున్నాయి. భారత్‌కు గతసారి కంటే ఒక పతకం తక్కువ వచ్చింది. కానీ భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేసి దేశప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేసిన విషయం విదితమే. దీనిపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) ఇవాళ తీర్పు వెలువరించనుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వినేష్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్‌పై అనర్హత పడిన కొద్దిసేపటికే ఆమె పారిస్‌లో ఆసుపత్రి పాలైంది.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో పసిడిపై ఆశలు సజీవంగా ఉంచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-బిలో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024)లో యువకుడు నిశాంత్ దేవ్ నుంచి భారత్ బాక్సింగ్‌లో పతకం ఆశించింది. ఆ క్రమంలోనే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అతను అద్భుతంగా ఆడాడు. కానీ పారిస్ ఒలంపిక్స్‌లో మాత్రం స్కోరింగ్ విధానం తప్పుగా ఉందని పలువురు అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో చివరి ఏడు రోజులు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో షూటింగ్‌లో దేశం మూడు పతకాలు సాధించగా, అందులో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. అయితే కొంతమంది పోటీదారులు మాత్రం ఈ రేసు నుంచి నిష్క్రమించారు. ఈ క్రమంలో మహిళల వ్యక్తిగత క్వార్టర్ ఫైనల్ ఈవెంట్‌లో దీపిక 4-6 తేడాతో దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహ్యోన్ చేతిలో ఓడిపోయింది.