Home » Paper Leakage
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ(NEET Paper Leak) వివాదం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బిహార్ రాష్ట్రం సమస్తిపూర్‌కి చెందిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నీట్ యూజీ పరీక్ష 2024కి(neet ug 2024 exam) సంబంధించిన వివాదం క్రమంగా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో వివాదం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ విషయంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో బీహార్ పోలీసులు ఆరు పోస్ట్ డేటెడ్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్‌పర్సన్ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.
ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నిందితులను ఎస్ఓజీ నిఘా సెల్, ఎస్‌టీఎఫ్ యూనిట్ గోరక్‌పూర్, ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి అభ్యర్థుల మార్కుల షీట్లు, అడ్మిట్ కార్డులు, బ్లాంక్ చెక్‌లు, మొబల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
పేపర్ లీక్‌లు పునరావృతం అవుతుండటంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై మంగళవారంనాడు నిప్పులు చెరిగారు. దేశ భవిష్యత్తుకు శత్రువుగా మారుతోందంటూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఉద్యోగాలు సృష్టించే సంస్థలను తమ మిత్రులకు అమ్ముకుంటున్నారని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం 'ఎక్స్'లో ఆరోపించారు.