• Home » Palnadu

Palnadu

Ambati Rambabu: పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈవోకు మంత్రి అంబటి ఫిర్యాదు

Ambati Rambabu: పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈవోకు మంత్రి అంబటి ఫిర్యాదు

Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.

AP Election 2024: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

AP Election 2024: పల్నాడు జిల్లా: నరసరావుపేటలో ఉద్రిక్తత

నరసరావుపేటలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడి చేశారు. మల్లమ్మ సెంటర్‌లో టీడీపీకి చెందిన నేత వాహనాన్ని నడిరోడ్డుపై వైసీపీ నేతలు తగలబెట్టారు.

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.

AP Elections: పల్నాడు ఘటనలపై ఈసీ సీరియస్

AP Elections: పల్నాడు ఘటనలపై ఈసీ సీరియస్

Andhrapradesh: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.

AP Election 2024:పోలింగ్‌కు ముందే... పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..

AP Election 2024:పోలింగ్‌కు ముందే... పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత.. కారణమిదే..

పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

AP Elections: ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్

AP Elections: ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మరోసారి విమర్శలు గుప్పించారు. వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలపై మాజీ మంత్రి మండిపడ్డారు. గతంలో ఇచ్చిన సున్నా వడ్డీ రుణాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ.. పావలా వడ్డీని కూడా పట్టించుకోలేదన్నారు.

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు

YS Sharmila: రూ.3 వేల కోట్ల నిధి ఏమైంది.. సీఎం జగన్‌పై షర్మిల నిప్పులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రూ.3 వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విరుచుకుపడ్డారు. మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

AP High Court: ఎన్నికల వేళ.. వైసీపీకి మళ్లీ దెబ్బ

ఎన్నికల వేళ.. అధికార వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. అధికార వైసీపీ వల్ల బాధిత కుటుంబాలుగా మారిన టీడీపీ సానుభూతిపరుల కుటుంబాలకు రక్షణ కల్పించాలని రెసిడెంట్లు.. కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం, డీజీపీ, పల్నాడు ఎస్పీలను ఏపీ హైకోర్ట్ ఆదేశించింది.

Yarapathineni: పల్నాడును రావణకాష్టంగా మార్చారు.. పిన్నెల్లిపై యరపతినేని ఫైర్

Yarapathineni: పల్నాడును రావణకాష్టంగా మార్చారు.. పిన్నెల్లిపై యరపతినేని ఫైర్

ఐదేళ్ల వైసీపీ పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడును రావణకాష్టంగా మార్చారని గురజాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు (Yarapathineni Srinivasa Rao) అన్నారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి నుంచి పల్నాడుకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఎన్నో అరాచకాలు చేశారని మండిపడ్డారు.

TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు

TDP: నీకు ఓటు అడిగే అర్హత ఉందా?... జగన్‌పై కన్నా విసుర్లు

Andhraprdesh: ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్నాడులో ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తూ.. జగన్‌ను ఏకిపారేశారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రికి ప్రచారం చేసే అర్హత లేదని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..పల్నాడులో ఓటు అడిగే హక్కు జగన్‌కు లేదన్నారు. హత్యలకు అడ్డంగా పల్నాడు మారిందని.. జగన్ పాలనలో పల్నాడు అభివృద్ధి శూన్యమని విరుచుకుపడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి