Home » Operation Sindoor
మహాదేవ్ పర్వత ప్రాంత పరిసరాలను కశ్మీర్ హిందువులు ప్రస్తుత సావన్ (శ్రావణ) మాసంలో పవిత్రంగా భావిస్తారు. అలాంటి ప్రాంతం నుంచి ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ 'టీ82' యాక్టివేట్ అయినట్టు సైనికులు గుర్తించారు.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఓటర్ ఐడీ కార్డులు, చాకొలెట్ రేపర్లు పాకిస్థాన్‌లో తయారైనవేనని అమిత్‌షా చెప్పారు. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడిపై రెండోరోజు మంగళవారంనాడు జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు.
భద్రతా లోపాల కారణంగానే పహల్గాం ఉగ్రగాడి ఘటన జరిగిందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఖర్గే ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్‌షా ఇందుకు బాధ్యత వహించాలన్నారు. దేశంలో టెర్రర్ ఇన్‌ఫ్రా నడ్డివిరిగిందని కేంద్రం చెబుతున్నప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని నిలదీశారు.
నిర్లక్ష్యం కారణంగానే అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారని పహల్గాం ఉగ్రదాడి నిరూపిస్తోందని అఖిలేష్ విమర్శించారు. దేశాన్ని పాలించేందుకు ప్రజల భావోద్వేగాలను తమకు ప్రయోజనకారిగా ప్రభుత్వం మార్చుకుంటోందని ఆరోపించారు.
పహల్గాంలో పర్యాటకులను దారుణంగా చంపారని, వివరాలు అడిగి మరీ చంపారని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కళ్లముందే శుభమ్ అనే వ్యక్తిని చంపేశారని అన్నారు. పహల్గాంలో పర్యాటకుల దగ్గర భద్రతా సిబ్బంది ఎందుకు లేరని ప్రశ్నించారు.
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు నవీన భారతదేశం ఎంతవరకైనా వెళ్తుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడితో 26 మందిని పొట్టనబెట్టుకున్న ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
రాజ్యసభలోనూ ఆపరేషన్ సింధూర్, పహల్గాం ఉగ్రదాడిపై 16 గంటల సేపు చర్చ మంగళవారంనాడు జరుగనుంది. రాజ్యసభలోనూ రక్షణ మంత్రి చర్చను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చర్చలో పాల్గొంటారు.
అమెరికా మధ్యవర్తిత్వంపై వస్తున్న ఊహాగానాలను జైశంకర్ కొట్టివేశారు. ఏప్రిల్ 22 జూన్ 17 మధ్య ప్రధానమంత్రి మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణలు జరగలేదని సభకు వివరించారు.