Home » Operation Sindoor
భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
Venkaiah Naidu:పహల్గామ్ ఉగ్రదాడి ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైన, హేయమైన చర్య అని భారత గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలిపారు. మతం పేరు అడిగి మరీ 26 మంది అమాయకులను కాల్చి చంపటం అత్యంత దారుణమని వెంకయ్య నాయుడు అన్నారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి గురించి వివరించేందుకు ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరు మాస్కోలో ల్యాండ్ అవుతున్న సమయంలో వారికి విచిత్రమైన అనుభవం ఎదురైంది.
ఆపరేషన్ సింధూర్ విజయంలో సాయుధ బలగాలు, మోదీ నాయకత్వాన్ని అభినందిస్తూ ఒక తీర్మానాన్ని శివసేన నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రవేశపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దేశ ప్రజల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెరిగిందని ఆ తీర్మానం పేర్కొంది.
పహల్గాం దాడి సందర్భంలో బాధిత మహిళలు అనుసరించాల్సిన తీరుపై బీజేపీ రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సదరు ఎంపీపై విపక్షాలు మండిపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఒక్కొక్కటిగా నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. భారత మహిళా పైలట్లు శత్రుదేశానికి చుక్కలు చూపించారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఏకంగా 200 మందిని లేపేశారని పేర్కొన్నాయి. దీని గురించి మరింతగా చూద్దాం..
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్‌లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.
ఉగ్రవాదం ముప్పును తిప్పి కొట్టేందుకు భారత్ స్వీయ రక్షణ హక్కు ఉందని జర్మనీ స్పష్టం చేసింది. పహల్గాం దాడిని ఖండించింది.
Mysore Pak: రాజస్థాన్, జైపూర్‌లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాపు ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాపు యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్‌లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు.