Home » Operation Sindoor
ప్రొఫెసర్ అలీఖాన్ భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రసంగంపై ఎలాంటి ఆంక్షలు లేవని, అయితే కేసు నమోదైనందున ఇందుకు సంబంధించి ఆన్లైన్లో ఎలాంటి పోస్టులు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.
భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌లోని 2.2 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకుపోయి ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరపడం, అత్యంత శక్తివంతంగా దాడులు జరగడంతో పాకిస్థాన్ రేంజర్లు కకావికలై పరుగులు తీయడం ఈ వీడియోలో కనిపిస్తోంది.
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని, పహల్గాం ఉగ్రదాడి వెనుక ఎవరున్నా వారిని అంతమొందిస్తామని అమిత్‌షా చెప్పారు. ముష్కరులు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుచేశారు.
Asaduddin Owaisi Slams Pakistan: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక ఫొటోను బహూకరించారు. ఆ చిత్రం ఇటీవల భారతదేశంపై పాకిస్థాన్ జరిపిన దాడికి సంబంధించినదని పేర్కొన్నారు. కానీ ఆ ఫోటో 2019 కి సంబంధించినది. దీంతో దాయాది దేశానికి తనదైన స్టైల్లో మరోమారు చురకలంటించారు AIMIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.
Jaishankar On India Pakistan Ceasefire: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం కృషి చేసింది మేమే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ సగర్వంగా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో మా వల్లే.. అంటూ పదే పదే చెప్తూ వస్తున్నారు. తాజాగా కాల్పుల విరమణకు సహకరించిన అమెరికాకు థ్యాంక్స్ చెప్తారా? అని అంతర్జాతీయ మీడియా ప్రశ్నించగా.. భారత విదేశాంగమంత్రి జై శంకర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.
Shashi Tharoor on Operation Sindoor: అఖిలపక్ష ప్రతినిధి బృందంతో పాటు గయానా చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పాక్ ఉగ్రవాదులు సృష్టించిన హింసకు ప్రతిస్పందన అని.. యుద్ధం కాదని అన్నారు. ఇంకోసారి భారత్ జోలికొస్తే రియాక్షన్ మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు పూర్తయిందని, భారత్ గణనీయమని ఆర్థిక ప్రగతి సాధించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. పాక్ పరిస్థితి ఏమిటని నిలదీశారు. జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, పాకిస్థాన్ ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.
ఇన్వెస్టిగేటర్ల సమాచారం ప్రకారం, మల్హోత్రాకు ఐఎస్ఐతో నేరుగా సంబంధాలున్నాయి. పాకిస్థాన్ హోం మంత్రి నుంచి స్పెషల్ సెక్యూరిటీ క్లియరెన్స్ లభించేది. పాక్ పర్యటన సందర్భంగా ఆమెకు ఏకే-47 పట్టుకున్న గన్మెన్లు సెక్యూరిటీగా ఉండేవారని తెలిపే ఒక వీడియో పోస్ట్ కావడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.