Home » Operation Sindoor
Pune Law Student: ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ శర్మిష్ట కామెంట్లు చేసింది. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. తాను తప్పు చేశానని గుర్తించిన శర్మిష్ట వీడియోను వెంటనే డిలీట్ చేసింది.
కాల్పుల విరమణ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయి ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
యావత్ భారతావని నిర్ఘాంతపోయేలా చేస్తున్న ఘటనలివి. సాధారణ భారతీయులు పాకిస్తానీ ISI ఏజెంట్లుగా ఎలా మారుతున్నారానేది ఇప్పుడు భారత్‌ను కలవరపరుస్తోన్న అంశం.
భారత దౌత్యం ఫలించింది. భారత దాడుల్లో మృతి చెందిన పాకిస్థానీలకు సంతాపం తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనను కొలంబియా తాజాగా ఉపసంహరించుకుంది. వాస్తవాం తమకు తెలిసిందని పేర్కొంది.
భారత్, పాక్‌ల మధ్య రాజీ కుదిర్చింది తానేనని ట్రంప్ మరోసారి చెప్పుకున్నారు. ఇరు దేశాల మధ్య అణు యుద్ధాన్ని నివారించినట్టు ప్రకటించారు.
సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
Defence Minister Rajnath Singh: 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు భారత నేవీ కూడా పాల్గొందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేశారు. భారత నేవీ దెబ్బకు పాక్ రెండుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ భారత నేవీ రంగంలోకి దిగి ఉంటే.. ఈసారి పాక్ నాలుగు ముక్కలు అయ్యేదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందం కొలంబియా పర్యటన హాట్ హాట్‌గా సాగింది. ఆ దేశ గడ్డపైనే కొలంబియా స్పందించిన తీరును శశిథరూర్ తూర్పారపట్టారు.
బిహార్ లో రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కరకట్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అనేక విషయాలపై ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్ కారణంగా పాక్‌లో మరణించిన వారిపై కొలంబియా సంఘీభావం ప్రకటించడం విచారకరమని ఎంపీ శశి థరూర్ అన్నారు. ఉగ్రవాద బాధితులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారినీ ఒకేగాటన కట్టడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.