Home » Operation Sindoor
ప్రపంచదేశాల్లో పాక్‌కు మద్దతు ఎందుకు లభిస్తోందంటూ కాంగ్రెస్ నేత షామా మొహమ్మద్ ప్రశ్నించారు. బాధిత దేశంగా భారత్ మిగిలితే పాక్ మాత్రం వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందని అన్నారు.
కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ఆదివారం నాడు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు.
పాకిస్థాన్‌కు రెండు వారాలు వారికి సమయం ఇచ్చినప్పటికీ ఉగ్రదాడులకు పాల్పడిన ముష్కరులపై ఒక్క చర్య కూడా తీసుకోలేదని అభిషేక్ బెనర్జీ చెప్పారు. పైగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు పాల్గొనడాన్ని అంతా చూశామని అన్నారు.
'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
ఉగ్రవాది జకీర్ రెహమాన్ లఖ్వీ పాక్ జైల్లో ఉండగానే తండ్రి అయ్యాడు.. ఇదీ.. పాకిస్థాన్ పాపాల బ్రతుకు అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అల్జీరియా దేశం ముందు పాక్ చేస్తున్న దురాగతాల్ని కళ్లకు కట్టినట్టు వివరించారు అసద్.
మన సైనికుల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానని, అయితే మన రక్షణ సన్నద్ధతపై నిపుణుల కమిటీతో తక్షణం ఒక సమగ్ర వ్యూహాత్మక సమీక్ష జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఖర్గే అన్నారు.
సరిహద్దుల వెంబడి పాక్ ప్రయోగించిన 600 డ్రోన్లలో సుమారు 40 శాతం, అంటే 2000 వరకూ డ్రోన్లు గుజరాత్ భూభాగంలోకి ఎలాగో ప్రవేశించినప్పటికీ ఎలాంటి మరణాలు కానీ, నష్టం కానీ సంభవించలేదని గుజరాత్ బీఎస్ఎఫ్ ఐజీ పాఠక్ వివిరించారు.
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని సీడీఎస్ కొట్టివేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని ఆయన అన్నారు.
శిశిథరూర్ బృందం తమ పర్యటనలో భాగంగా కొలంబియా విదేశాంగ ఉప మంత్రి రోసా యెలాండ్ విల్లావెసెన్సియోతో భేటీ అయింది. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వివరాలను సమగ్రంగా తెలియజేసింది.
ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని ఎంజే అక్బర్ అన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.