Home » online
రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక సంస్థ అందించే అన్ని సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. తద్వారా పర్యాటకుల విలువైన సమయం వృథా కాకుండా ఏర్పాట్లు చేయనున్నారు.
ఆన్‌లైన్(Online)లో పగటిపూటతో పాటు అర్ధరాత్రిళ్లు సైతం ఆర్డర్లు అధికమైనట్లు ఇన్‌స్టామార్ట్ సంస్థ (Instamart Company)అధ్యయనంలో పేర్కొంది. గతేడాదితో పోలిస్తే బాగా పెరిగినట్లు తెలిపింది.
ఆన్‌లైన్ గేమ్‌లో డబ్బులు పోగొట్టుకొని మనస్తాపానికి గురెన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
Online Cloth Shopping Tips: ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన బట్టలు తీరా డెలివరీ చేశాక నాణ్యత విషయంలో తరచూ సమస్యలు ఎదురవుతుంటాయి. ఫోన్‌లో చూసినప్పుడు ఉన్నంత క్వాలిటీ రియాలిటీలో ఉండదు. ఇలా మరోసారి జరగకూడదంటే ఫ్యాబ్రిక్ నాణ్యతను దానిని తాకకుండానే ఇలా తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్ రమ్మీకి మరోకరు బలయ్యారు. ఈ ఆన్‌లైన్ రమ్మీ పుణ్యమాని ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. వేలూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ ఆన్‌లైన్ రమ్మీలో రూ.50 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆర్ధికంగా చితికిపోయిన ఆయన మనోధైర్యం కోల్పోయి చివరకు తనువు చాలించాడు.
ఆన్‌లైన్ రమ్మీ.. మరోకరి ప్రాణాలు తీసింది. మొత్తం రూ. 10 లక్షల పోవడంతో ఓ బ్యాంక్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యావంతుడు.. పైగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి ఉద్యోగే ఈ క్రీడకు బలైపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆన్‌లైన్ మోసాలకు ఇక అడ్డుకట్ట పడనుందా అంటే.. అవునంటున్నారు సాంకేతిక నిపుణులు. ఇందుకు సంబంధించి ఒడిస్సీ టెక్నాలజీస్ కొత్త సాఫ్ట్‌వేర్లను రూపొందించినట్లు, తద్వారా ఈ తరహ మోసాలకు అతి త్వరలోనే చెక్ పడబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలునుతున్నారు.
సిటీ బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. చిల్లర సమస్యకు తావులేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సిటీ బస్సులో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ఉంచుతారు. యూపీఐ పెమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు టీజీఎస్ ఆర్టీసీ కల్పించింది.
ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయిన ఓ ఆటో డ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
Online Game: కుమారుడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిపోయాడు. ఇది చూసిన కన్నతల్లి ఎన్నో సార్లు కొడుకుకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల భవిష్యత్ పాడవుతుందని ఎన్నో సార్లు కొడుకుకు సర్ధిచెప్పింది కూడా. అయినప్పటికీ అతడు ఆన్‌లైన్ గేమ్స్ విషయం వెనక్కి తగ్గలేదు. పగలు, రాత్రి అదే పనిగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడాడు.