Home » Ongole
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..
బాలినేని శ్రీనివాస్ (Balineni Srinivasa Reddy).. వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పేస్తారా..? ఇక పార్టీలో ఉండకూడదని ఫిక్స్ అయ్యారా..? వైఎస్ జగన్‌తో (YS Jagan) ఉంటే పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని.. కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారా..? మూడో కంటికి తెలియకుండా లోలోపలే చర్చలు కూడా జరుగుతున్నాయా..? అంటే..
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు(Bus Stands, Railway Stations) ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జూబ్లీబస్టాండ్లు(Mahatma Gandhi and Jubilee Bus Stands) ప్రయాణికులతో శనివారం రద్దీగా మారాయి.
పది రూపాయలకే రెండు క్వార్టర్ బాటిళ్లు.. యాభై రూపాయలకే బియ్యం బస్తా!.. ఓటమి భయంతో ఒంగోలు వైసీపీ అభ్యర్థులు ఓటర్లకు పంచుతున్న తాయిలాల పరంపర ఇది! ఒంగోలు లోక్‌సభ, అసెంబ్లీ వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న నేతలు ఓటమి భయంతో ఇప్పటికే అనేక రకాలుగా ఓటర్లను మభ్యపెట్టారు. ఇక పోలింగ్ దగ్గర పడడంతో ఓటుకు నోటుతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో ఓటుకు రూ.3వేలు పంపిణీ చేశారు.
‘బస్సులు పెడ్తున్నం.. బేగి బయల్దేరండి’ అంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఓటు హక్కు ఉన్న హైదరాబాద్ వాసులకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి ఫోన్‌కాల్స్ వెల్లువెత్తుతున్నాయి..
ఈ ఎన్నికల్లో సింపతి కోసం సీఎం జగన్ ప్రాదేయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) అన్నారు. పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
పర్యాటకులు, భక్తుల కోసం ప్రత్యేకించి మే 25 నుంచి 9 రోజుల పాటు భారత్ గౌరవ్ రైలు ‘దివ్య దక్షిణ యాత్ర’కు బయలుదేరుతుందని ఐఆర్‌సీటీసీ అధికారులు తెలిపారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వంలో తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ ( Nara Lokesh) హెచ్చరించారు. ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువగళ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. పలు చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేను ఏకిపారేశారు. ఎమ్మెల్యేగా ఉండి బాగా సంపాదించారని.. అన్నీ దోచేశారంటూ విరుచుకుపడ్డారు.