Home » Odisha
ఒడిశాలో సార్వత్రిక సమరానికి మరి కొన్ని గంటలే మిగిలున్న వేళ బీజేపీ(BJP) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మే 13న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఒడిశాలో(Odisha) శనివారం ప్రధాని మోదీ(PM Modi) పర్యటించనున్నారు.
ఒడిసా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? పాతికేళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా? ఇదే అదునుగా బీజేపీ పుంజుకుని, విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు.
ఒడిశాలోని బీజేడీ ప్రభుత్వం మే 4వ తేదీతో ముగుస్తుందని.. అనంతరం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ తనదైన శైలిలో స్పందించారు. ప్రధాని మోదీ పగటి కలలు కంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఒడిశాలో(Odisha) రెండు యాగలు జరుగుతున్నాయని.. ఒకటి దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పాటు చేయడానికి, మరోటి రాష్ట్రంలో బీజేపీ(BJP) నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ కోసమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ(PM Modi) సోమవారం బెహ్రంపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
ఒడిశాలోని పూరీ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సుచరిత మొహంతీ పోటీకి నిరాకరించారు. పార్టీ టిక్కెట్ తిరిగి ఇచ్చేశారు. ప్రచారానికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు పార్టీ నిరాకరించడమే ఇందుకు కారణం.
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ సోమవారం విడుదల చేసింది. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 57 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కొద్దిమంది బిలియనీర్ల కోసం పనిచేస్తోందని, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలోని కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం పనిచేస్తుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ-బీజేడీల మధ్య ''వైవాహిక బంధం'' ఉందని కూడా ఆయన ఆరోపించారు.
ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.
భద్రత దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బౌద్ జిల్లా పర్హెల్ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామన ఈ ఘటన చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారి సౌమేంద్ర ప్రియదర్శి తెలిపారు.
ఒడిశాలో(Odisha) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలోని మహానదిలో(Mahanadi) జరిగిన పడవ ప్రమాదంలో 7 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని ఖర్సియాకి చెందిన 50 మందికిపైగా ప్రయాణికులు బార్‌ఘర్ జిల్లా పథర్సేని కుడాలోని ఆలయాన్ని సందర్శించి పడవలో తిరిగి వస్తున్నారు.